Bigg Boss 6 Telugu Shrihan- Revanth: భారీ అంచనాల నడుమ అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబీకులు రావడం తో పాటు..బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ అనే ఎంటర్టైన్మెంట్ టాస్కు కూడా కొనసాగింది..ఈ టాస్కు లో ఇంటి సభ్యులందరు తమ పరిధిమేర ఎంటర్టైన్ బాగానే చేసారు..ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వీక్ కెప్టెన్సీ టాస్కు ఈరోజు రానే వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో ఇదే చివరి కెప్టెన్సీ టాస్కు అని చెప్పొచ్చు..ఇప్పటి వరుకు ఇంటికి కెప్టెన్ కాకుండా ఉన్న ఇనాయ మరియు రోహిత్ కి ఇది బంగారం లాంటి అవకాశం అని చెప్పొచ్చు..ఎందుకంటే ఈ వారం కెప్టెన్ అయినా వారు నేరుగా సెమి ఫైనల్స్ కి వెళ్తారు..అంటే ఈ వారం నామినేషన్స్ లో అతి తక్కువ వోటింగ్ వచ్చిన కంటెస్టెంట్ ఒకవేళ కెప్టెన్ అయితే ఎలిమినేట్ ఎవ్వడు అన్నమాట.
చివరి కెప్టెన్సీ టాస్కు గా బిగ్ బాస్ ఇచ్చిన ‘గ్రాబ్ & రన్’ టాస్కుని ఇంటి సభ్యులందరూ కసిగా ఆడారు..అయితే ఈ టాస్కులో రేవంత్ మరియు శ్రీహాన్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి..ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ ‘నీ చెయ్యి ఒత్తిడి నా మీద చాలా గట్టిగా పడింది రా..ఊపిరి ఆడలేదు’ అని అంటాడు..అప్పుడు రేవంత్ ‘కావాలని ఎవడైనా చేస్తాడా రా..చూడకుండా మాట్లాడుకురా..చెప్తున్నా’ అని రేవంత్ సీరియస్ గా మాట్లాడుతాడు.

అలా ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కెప్టెన్సీ టాస్కు ని గెలిచి ఇంటి చివరి కెప్టెన్ గా ఎవరు నిలవబోతున్నారు..? ఎవరు సెమి ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి వరుకు ఎదురు చూడాల్సిందే..ఈ వారం మొత్తం ఫన్ మరియు ఎమోషనల్ గా సాగిపోయిన బిగ్ బాస్ హౌస్..ఒక్కసారిగా కెప్టెన్సీ టాస్కు తో వేడెక్కిపోయింది..దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చెయ్యగా అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.