Pooja Hegde : పూజ హెగ్డే.. ప్రస్తుతం ఈ అమ్మడు టైం నడుస్తోంది. ఈ కర్ణాటక బ్యూటీ పట్టిందల్లా బంగారమైంది. టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో జట్టుకట్టిన పూజా ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ కి జంటగా కిసీ కి భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటిస్తున్నారు. 2023 రంజాన్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. ఇక రణ్వీర్ సింగ్ కి జంటగా చేస్తున్న మరో బాలీవుడ్ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. రోహిత్ శెట్టి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం.

తెలుగులో వరుస విజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజాకు షాక్ ఇస్తూ మూడు వరుస ప్లాప్స్ పడ్డాయి. ఆమె హీరోయిన్ గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ దారుణ పరాజయం చవిచూశాయి. పూజా ఇమేజ్ ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాటపట్టింది.
అయితే సడెన్ గా పూజా హెగ్డే కాలికి గాయమైంది. సల్మాన్ ఖాన్ చిత్రంలో ఏదో స్టంట్ చేస్తుండగా పూజా కాలిగి బలమైన గాయం అయ్యింది. అప్పటి నుంచి కాలికి పట్టి కట్టుకొని బెడ్ పై కదలకుండా వైద్యచికిత్స తీసుకుంటోంది.
ఇప్పటికీ మూడు వారాలుగా మంచానికే పరిమితం అయ్యింది. తాజాగా కాలికి గాయం నుంచి పూజా కోలుకుంటోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వాకర్ సాయంతో నడుస్తోంది.
పూజా హెగ్డే నడుస్తున్న పొటోలు, వీడియోలను షేర్ చేసింది. తాను కోలుకుంటున్నట్టు హింట్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ పూజ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం పూజా చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ ల మూవీ ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ మొదలు కాగా సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతుండగా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్లాప్స్ లో ఉన్న పూజాకి ఇది కమ్ బ్యాక్ చిత్రం అవుతుందని భావిస్తున్నారు. పూజా రోల్ సైతం త్రివిక్రమ్ సరికొత్తగా రూపొందించారట. త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకు ఇది వరుసగా మూడో చిత్రం.