Rashmi Gautam: తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో గుర్తింపు ఉండదు అనే నానుడి ఎప్పటి నుంచో వుంది. అది నిజం కూడాను. సినిమా అనేది వ్యాపారం అయ్యాక పాన్ ఇండియా గ్లామర్, ఇమేజ్ ఉన్న అమ్మాయిలనే హీరోయిన్స్ గా తీసుకుంటున్నారు. కనీసం టైర్ టు హీరోలు, తక్కువ బడ్జెట్ చిత్రాల మేకర్స్ కూడా తెలుగు అమ్మాయిలను పరిగణలోకి తీసుకోవడం లేదు. టాలీవుడ్ తో పోల్చితే కోలీవుడ్ లో కొంచెం విలువ ఇస్తున్నారు. సొంత ఇంట్లో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. ఓ స్థాయి హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు అమ్మాయిలు ఈ విషయంలో చాలా అసహనంగా ఉన్నారు. తాజాగా రష్మీ తనలోని ఆక్రోషాన్ని బయటపెట్టారు. ఒక నెటిజెన్ తెలుగు బుల్లితెర యాంకర్స్ స్కిన్ షోపై చేసిన ట్రోల్ ఆధారంగా చేసుకొని ఆమె కీలక కామెంట్స్ చేశారు. విష్ణుప్రియ, అనసూయ, శ్రీముఖి, రష్మీ, అషురెడ్డిల హాట్ ఫోటోలను జత చేసి… మావా వీళ్ళు హీరోయిన్స్ కాదు. హీరోయిన్స్ కావాలని ఆశపడి కుదరక అలా ఉండిపోయారు, అంటూ ఒక మీమ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సదరు మీమ్ పై రష్మీ స్పందించారు. మీ మాటల్లో వాస్తవం ఉంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. ముంబై బోర్డింగ్ పాస్ ఉన్న అమ్మాయి అయితే కథ వేరుగా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకున్న బట్టలు కూడా ట్రెండ్ సెట్టింగ్ గా ఉండేదేమో. ఏది ఏమైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు… అంటూ కామెంట్ చేసింది. రష్మీ కామెంట్ వైరల్ గా మారింది.

ముంబై హీరోయిన్స్ పొట్టి బట్టలు వేస్తే లొట్టలేసుకుని చూస్తారు, అదే మేము వేస్తే విమర్శిస్తారని రష్మీ పరోక్షంగా కౌంటర్ వేశారు. అదే సమయంలో తెలుగు అమ్మాయిలకు దర్శక నిర్మాతల అవకాశాలు ఇవ్వరనే ఆవేదన కూడా కనిపిస్తుంది. నిజానికి రష్మీకి హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. బ్యాడ్ స్క్రిప్ట్ సెలక్షన్ తో రష్మీ ఫేమ్ పోగొట్టుకున్నారు. అనసూయ సిల్వర్ స్క్రీన్ కెరీర్ మెల్లగా మొదలైనా… లాంగ్ రన్ ప్లాన్ చేసుకుంది. లీడింగ్ రోల్స్ తో పాటు స్టార్స్ చిత్రాల్లో అనసూయ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.