spot_img
Homeఎంటర్టైన్మెంట్F3 Movie: ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ అంటూ అంచనాలు పెంచారు !

F3 Movie: ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ అంటూ అంచనాలు పెంచారు !

F3:  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది. ఇక ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు.

F3 Movie
F3 Movie

మొత్తానికి “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ ఫుట్ చాలా బాగుంది. ఈ ప్రోమో.. సాంగ్ పైనే కాకుండా సినిమా పై కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది.

Also Read:  ఏపీ సర్కారు ఉద్యోగుల వేతనాల కోసం పెడుతున్న ఖర్చు ఎంతంటే?

సహజంగా అనిల్ రావిపూడి సినిమాల్లో మంచి హైలైట్ పాయింట్ ఏమిటంటే.. కామెడీ అంతా హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొచ్చేలా పాత్రలను డిజైన్ చేస్తాడు. ఇక ఎఫ్ 3 సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. అలాగే, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్‌ తేజ్ కనిపిస్తున్నాడు.

F3 Movie
F3 Movie

మొత్తమ్మీద వీరి లోపాలు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయట. అదే విధంగా ఎఫ్ 2లోని వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ త‌మ‌న్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించి.. అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు.

ఇక ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper
Exit mobile version