Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా సోకి అలా 10 రోజులు ఐసొలేషన్ లో ఉన్న చిరంజీవి, కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన తర్వాత బయటకొచ్చారు. నేరుగా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తను కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని ప్రకటించారు.

తను పూర్తిగా కోలుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు. చిరంజీవి ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగడంతో సినిమా పనుల్లో స్పీడ్ డబుల్ అయింది. ఇక ఈ గాడ్ ఫాదర్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది.
Also Read: : వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !
ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడట. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. ఇక మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట.
ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే చిరు లుక్స్ ను పూర్తిగా మార్చబోతున్నాడు. పంచె కట్టుతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో
చిరు పక్కా క్లాసిక్ మాస్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.

అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే
సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం.
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.