https://oktelugu.com/

Sankranti ki vasthunnam Movie : సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విలన్ ను ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేరు అంటూనే హింట్ ఇచ్చిన దర్శకుడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే... ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సక్సెస్ లను సాదించబోతున్నాడు అనేది...

Written By: , Updated On : January 8, 2025 / 10:14 PM IST
Sankrantiki Vasthunnam Movie

Sankrantiki Vasthunnam Movie

Follow us on

Sankrantiki Vasthunnam Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన కెరియర్ మొదటి నుంచి కూడా ఫ్యామిలీ సబ్జెక్టులని ఎంచుకుంటూ మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన అనిల్ రావిపూడి సైతం ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా ఆయన మంచి సక్సెస్ లను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మినిమం గ్యారంటీగా ఉండబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడానికి అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి భారీ సక్సెస్ ని అందుకుంటే వరుస విజయాలను సాధిస్తున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత వరుసగా ఎనిమిదోవ సక్సెస్ ని కూడా అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.

మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకే అయితే ఇకమీదట చేయబోయే సినిమాను మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మరి ఇదిలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో విలన్ ఎవరు అనేది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేరు అంటూ అనిల్ రావిపూడి ఒక హింట్ అయితే ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో కామెడీయన్ ను విలన్ గా మార్చినట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి. మరి ఆ ట్విస్ట్ ఏంటి అసలు ఈ సినిమాలో విలన్ కి హీరో కి మధ్య వచ్చే కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

ఇక ఆయన సినిమాలో కామెడీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా కామెడీగానే సాగబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి కూడా తనకంటూ భారీ గుర్తింపు ను సంపాదించుకున్నాడు…