Yuzvendra Chahal- Dhanashree : యజువేంద్ర చాహల్, ధనశ్రీ 2022లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. చాహల్ ఎక్కడ మ్యాచ్ ఆడినా.. ధనశ్రీ అక్కడికి వెళ్ళేది. అతడిని సపోర్ట్ చేసేది. కొత్తకాలం ప్రేమలో మునిగి తేలిన తర్వాత వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ ధనశ్రీ తన కెరియ ను వదులుకోలేదు. చాహల్ కూడా ఆమెను ప్రోత్సహించాడు. అందువల్లే ఆమె ఓ రియాల్టీ షోలో పాల్గొన్నది. అందులో అదిరే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నది. అదే రియాల్టీ షోలో చాహల్ కూడా పాల్గొన్నాడు. ధనశ్రీ, చాహల్ ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కూడా కొంతకాలం వారిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెకేషన్ కు వెళ్లారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా(social media)లో పంచుకున్నారు.
తొలిసారిగా స్పందించింది
వెకేషన్ వెళ్ళిన తర్వాత కూడా చాహల్, ధనశ్రీ బాగానే ఉన్నారు. అయితే ఆ మధ్య ధనశ్రీ ఒక కొరియోగ్రాఫర్(choreographer) తో అత్యంత చనువుగా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అది ధనశ్రీ, చాహల్ మధ్య వివాదానికి కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అవి విడాకులకు దారి తీశాయని తెలుస్తోంది. క్రమంలోనే ధనశ్రీ ఇన్ స్టా గ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ” కొద్దిరోజులుగా కుటుంబంతోపాటు నేను కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను. నా వ్యక్తిత్వానికి కించపరిచే విధంగా నిరాధారమైన కథనాలు వస్తున్నాయి. ఇవి నాకు బాధను కలగజేస్తున్నా. చాలా సంవత్సరాల పాటు కష్టపడి ఇంత మంచి పేరు సంపాదించుకున్నాను. విలువలకు కట్టుబడి ఉన్నాను. వాస్తవాలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తాను. ఇలాంటి సమయంలో నాకు కుటుంబం సపోర్టు ఉంది. దాని ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకుంటానని” ధనశ్రీ తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు చాహల్ ఇంకో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. అందువల్లే ధనశ్రీని దూరం పెట్టాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఆగిపోవాలంటే అటు ధనశ్రీ, ఇటు చాహల్ నోరు విప్పాలి. మరో వైపు చాహల్, ధనశ్రీ ఉదంతం పై రోజుకో తీరుగా కథనాలు వస్తున్నాయి. ధనశ్రీ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని.. అందువల్లే చాహల్ విడాకులు ఇచ్చాడని.. చాహల్ దూరం పెట్టాడని.. అందువల్ల ధనశ్రీ విడాకులు ఇచ్చిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాన్ని మర్చిపోకముందే చాహల్, ధనశ్రీ విడాకుల వ్యవహారం తెరపైకి రావడం.. దాని వెనుక రకరకాల కథనాలు ప్రసారం కావడంతో.. సోషల్ మీడియాలో చిత్ర విచిత్రంగా ప్రచారం జరుగుతోంది