Prithvi Shaw : పృథ్వీ షా(Prithvi Shaw) అద్భుతమైన ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సూపర్ బ్యాటింగ్ చేస్తాడు. అదే సమయంలో ఫీల్డింగ్ లోనూ అద్భుతాలు చేస్తాడు. సృష్టిస్తాడు కూడా.. నాటి రోజుల్లో అతని ఆటను చూసి చాలామంది మెచ్చుకున్నారు. ముఖ్యంగా సచిన్ అయితే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎప్పుడో ఒకప్పుడు జాతీయ క్రికెట్ జట్టు (National cricket team) కు నాయకత్వం (captaincy) వహిస్తాడని జోస్యం చెప్పాడు. అయితే అటువంటి ఆటగాడు ఫేమ్ రావడంతో ఆటను మర్చిపోయాడు. క్రమశిక్షణను కోల్పోయాడు. అనవసరమైన విషయాలలో తల దూర్చాడు. ఫలితంగా జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇష్టానుసారంగా తినడంతో ఒళ్ళు కొండలా పెరిగిపోయింది. భారీ కాయాన్ని అతడికి మిగిల్చింది. దీంతో అతని చూసిన చాలామంది ఇతడు క్రికెటర్ ఏంటి అనుకోవడం మొదలుపెట్టారు.ఫిట్ నెస్ మీద దృష్టి లేకపోవడంతో పృథ్వీ షా అవకాశాలు కోల్పోయాడు.
రాహుల్ ద్రావిడ్ చెప్పాడు కూడా
ఇటీవల వినోద్ కాంబ్లీ (Vinod kambli) ప్రస్తావన వచ్చినప్పుడు టీం మీడియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పృథ్వీ షా గురించి చెప్పాడు..” అతడు గొప్ప ఆటగాడు అవుతాడని అనుకున్నాం. బ్యాటింగ్ బాగా చేస్తాడు కాబట్టి మెరుగైన రికార్డులు సృష్టిస్తాడని భావించాం. టీమిండియాలో సచిన్ లేని లోటును భర్తీ చేస్తాడని ఊహించాం. కానీ మా అంచనాలకు భిన్నంగా అతడు ఆడాడు. చివరికి అర్ధాంతరంగా కెరియర్ కు స్పీడ్ బ్రేకర్ ఇచ్చుకున్నాడని” ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.. అయితే రంజీలో ముంబై జట్టు నుంచి కూడా చోటు కోల్పోవడంతో పృథ్వీ నష్ట నివారణ చర్యలకు దిగాడు. తన శరీర భరును తగ్గించుకోవడం కోసం సాధన చేస్తున్నాడు. ఫిట్ నెస్ మెరుగుపరుచుకుంటున్నాడు. ట్రాక్ పై పరుగులు తీస్తున్నాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇటీవల ముంబై రంజి జట్టు పృథ్వీ కి అవకాశాలు ఇవ్వకుండా.. బయటికి వెళ్లిపోయేలా చేసింది. మొన్నటి ఐపీఎల్ మెగా వేలం లోనూ పృథ్వీ ని ఈ జట్టూ కొనుగోలు చేయలేదు. ఇవన్నీ కూడా అతనిపై తీవ్ర ప్రభావం చూపించాయి. అందువల్లే తన శరీరాన్ని నాజూకుగా మార్చుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే రకరకాల కసరత్తులు చేస్తున్నాడు. పృథ్వీ అలా చేయడం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఒకవేళ గనుక ముందే ఈ పని చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆలస్యంగానైనా మంచి పని చేస్తున్నాడని పేర్కొంటున్నారు.