Homeఎంటర్టైన్మెంట్బూతు సిరీస్ లో స్టార్ హీరో కుమార్తె !

బూతు సిరీస్ లో స్టార్ హీరో కుమార్తె !

ఒకప్పుడు స్టార్ హీరో కుమార్తె నటిగా ఎంట్రీ ఇస్తానంటే అభిమానులు అసలు అంగీకరించేవారు కాదు. అయితే కాలం మారింది. హీరో కూతురు అందంగా ఉంటే హీరోయిన్ని చేయండి అని అభిమానులే ఆ హీరోకి ఓ ఉచిత సలహా పడేస్తున్నారు. అయితే, హిందీ హీరోయిన్, స్టార్ హీరో అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ హీరోయిన్ అవుతాను అంటే.. మొదట్లో ఎవరూ ఒప్పుకోలేదు, అనిల్ కపూర్ ఒక్కడే కూతుర్ని దగ్గర ఉండి హీరోయిన్ని చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో […]

ఒకప్పుడు స్టార్ హీరో కుమార్తె నటిగా ఎంట్రీ ఇస్తానంటే అభిమానులు అసలు అంగీకరించేవారు కాదు. అయితే కాలం మారింది. హీరో కూతురు అందంగా ఉంటే హీరోయిన్ని చేయండి అని అభిమానులే ఆ హీరోకి ఓ ఉచిత సలహా పడేస్తున్నారు. అయితే, హిందీ హీరోయిన్, స్టార్ హీరో అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ హీరోయిన్ అవుతాను అంటే.. మొదట్లో ఎవరూ ఒప్పుకోలేదు, అనిల్ కపూర్ ఒక్కడే కూతుర్ని దగ్గర ఉండి హీరోయిన్ని చేశాడు.

కెరీర్ స్టార్టింగ్ లో డీసెంట్ పాత్రలు చేసిన సోనమ్ ఆ తర్వాత ఎక్స్ పోజింగ్ లో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. పైగా చాలా బోల్డ్ విషయాల పై అంతే బోల్డ్ గా అంతే నిర్భయంగా కామెంట్ చేయడం అలవాటు చేసుకుంది. మరి ఈ బోల్డ్ ప్రపంచంలో బతకడం సోనమ్ కి సర్వసాధారణం అయినట్టు ఉంది, ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ బూతు సిరీస్ ప్రముఖ దర్శక నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో రాబోతుంది. ఏక్తాకపూర్ ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీ అంటేనే బూతు మయం. పైగా ఏక్తా కపూర్ కి బూతు అంటేనే ఇంట్రెస్ట్. మరి ఇలాంటి అభిరుచి ఉన్న నిర్మాత నుండి రానున్న వెబ్ సిరీస్ ఇక ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా ముచ్చటించుకోక్కర్లేదు. అసలు తన ఓటీటీ సంస్థనే అశ్లీలత అనే ఐటమ్ మీద నడుస్తుంది.

ఇంతకీ ఈ సిరీస్ కాన్సెప్ట్ ఏమిటంటే సెక్సిజం. సాహిత్యంలో మహిళల పై ఇప్పటివరకు రాసిన బోల్డ్ నెస్ కి భిన్నంగా ఈ సిరీస్ నడుస్తోందట. మహిళలు తమ సుఖం కోసం తాము నిలబడి పోరాడాలని, విషయం లేని భర్తను పూజిస్తూ ఉండటం అర్ధం లేని పని అని, జీవించినంత కాలం నచ్చినట్టు ఎలాంటి ఆచారాలు పాటించకుండా బతకాలనే కోణంలో ఈ సిరీస్ నడుస్తోందట. ఈ సిరీస్ లో సోనమ్ కపూర్ క్యారెక్టర్ బాగా బోల్డ్ గా ఉంటుందట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper