
ఏపీకి కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్ అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తాం అని అన్నారు.