Star Heroine: సినిమా అనేది నలుగురితో కూడిన వ్యవహారం. 24 క్రాఫ్ట్స్ పని చేస్తేనే ఒక మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. ఇక హీరో, హీరోయిన్ కీలకం. ఆడియన్స్ ఒక మూవీలో నటించే స్టార్స్ ఫేమ్ ఆధారంగా కూడా ఆసక్తి చూపుతారు. ఈ తరం స్టార్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రం డిమాండ్ ఉంటే ఏక కాలంలో మల్టీ ప్రాజెక్ట్స్ చేయవచ్చు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కీలకం.
ఏ ఒక్క నిర్మాత ఇబ్బందిపడకుండా కాల్ షీట్స్ ఇవ్వాలి. షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. కాగా ఓ హీరోయిన్ నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకుంటుందట. అయితే షూటింగ్స్ కి మాత్రం హాజరు కావడం లేదట. కర్లీ హెయిర్ తో, క్యూట్ గా ఉండే ఈ మలయాళ హీరోయిన్ కి ఇటీవల భారీ హిట్ పడింది. వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంలో హీరోయిన్ గా చేసింది. మూవీ సక్సెస్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం హీరో కొట్టేశాడు. ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.
ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. ఈ హీరోయిన్ తన సొంత రాష్ట్రంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటుందట. దాని నిర్మాణానికి డబ్బులు కావాల్సి రావడంతో పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తుందట. నిర్మాతల నుండి అడ్వాన్సులు తీసుకుంటుందట. అందులో తప్పేమీ లేదు. డబ్బులు తీసుకుని… షూటింగ్ కి హాజరు కాకపోతోనే ప్రాబ్లమ్. ఆమె నిర్మాతలను ఇబ్బంది పెడుతుందట. ఓ నిర్మాత, గిల్డ్ లో ఫిర్యాదు కూడా చేశాడట. సదరు హీరోయిన్ తో పాటు మేనేజర్ మీద నిర్మాతలు గుర్రుగా ఉన్నారట.
ఇప్పటికైనా నిర్మాతలకు సహకరిస్తే ఆమె కెరీర్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు. లేదంటే బ్యాన్ చేసినా ఆశ్చర్యం లేదు. గతంలో కొందరు హీరోయిన్స్ ఇలాంటి ప్రవర్తన కారణంగా నష్టపోయారు. దర్శక నిర్మాతలకు విసుగుపుట్టించే హీరోయిన్స్ ని పరిశ్రమ ఎంకరేజ్ చేయదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. పలు భాషల్లో ఆమె నటిస్తున్నారు. ఆ మధ్య అమ్మడు కెరీర్ నెమ్మదించింది. మరలా తిరిగి పుంజుకుంది.