https://oktelugu.com/

Nepal Premier League: నేపాల్ ప్రీమియర్ లీగ్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

టి20 క్రికెట్ అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలు టి20 క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. మన దేశానికి పొరుగున ఉన్న నేపాల్ కూడా నేపాల్ ప్రీమియర్ లీగ్ 2024 పేరుతో టి20 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. ఇది నేపాల్ లోని కీర్తిపూర్ త్రిభువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 4, 2024 / 12:01 PM IST

    Nepal premier league

    Follow us on

    Nepal Premier League: ఈ టోర్నీలో టేబుల్ టాపర్ గా జనక్ పూర్ బోల్డ్స్ జట్టు కొనసాగుతోంది. ఈ జట్టుకు సందీప్ లామి చానే నేతృత్వం వహిస్తున్నాడు. గత శనివారం బిరత్ నగర్ కింగ్స్ జట్టు పై జనక్ పూర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లో జనక్ పూర్, బిరత్ నగర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. జనక్ పూర్ ఆటగాడు లాహిరు మిలాంత 53 బంతులు ఎదుర్కొని 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బిరత్ నగర్ జట్టు 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది. లలిత్ రాజ్ బన్షి, హర్ష్ , కిషోర్ మహతో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బిరత్ నగర్ 127 పరుగులకు కుప్పకూలింది.ఇక ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలో ఉన్న సుదుర్ పస్చిమ్ రాయల్స్ బుధవారం బిరాట్ నగర్ కింగ్స్ స్క్వాడ్ జట్టుతో తలపడనుంది.

    జట్ల వివరాలివే..

    సుదుర్ పస్చిమ్ రాయల్స్

    దీపేంద్ర సింగ్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, బ్రాండన్ మెక్ మల్లెన్, సైఫ్ జైబ్, అమిత్ శ్రేష్ట, కడక్ బహదూర్ బుహారా, నరేష్ బుదయోర్, బోజ్రాజ్ భట్టా, ఇషాన్ పాండే, అర్జున్ కుమాల్, బినోద్ బండారీ, అబినాష్ బొహారా.

    బిరత్ నగర్ కింగ్స్

    సందీప్ లామిచానే(కెప్టెన్), లోకేష్ బామ్, ప్రతిష్ జిసి, బషీర్ అహ్మద్, రాజేష్ పులమీ మగర్, అఖిల్ ఇలియాస్, ఇస్మత్ అలం, నిచోలాస్ కర్టన్, మృణాల్ గురుంగ్, నరేన్ భట్టా, అనిల్ ఖరీల్, దీపక్ బొహారా, బషీర్ అహ్మద్.

    సుదుర్ పస్చిమ్ రాయల్స్ vs బిరత్ కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ భారత్ లో ఫ్యాన్ కోడ్ ఓటీటీ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. నేపాల్ లో యాక్షన్ స్పోర్ట్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ టోర్నీ అధికారిక ప్రసార కర్తగా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కొనసాగుతోంది. స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1 చానల్ లోనూ ఈ మ్యాచ్ చూడొచ్చు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆటగాడు సోహైల్ తన్వీర్ ఐదు వికెట్లు సాధించాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న సోహైల్ ఐదు వికెట్లు సాధించిన మొదటి బౌలర్ గా రికార్డు సృష్టించాడు.. స్థానికంగా టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక నేపాల్ లో క్రికెట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో.. వరుసగా టోర్నీలో నిర్వహిస్తూ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అక్కడి క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.. యువకుల నుంచి విశేషమైన స్పందన రావడంతో అక్కడ క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉంది.