Mulugu Earthquake: దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే మేడారం బుధవారం ఉదయం నుంచి వార్తల్లో నిలిచింది. సహజంగా సమ్మక్క సారలమ్మ జాతరప్పుడు ఈ ప్రాంతం వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు జాతర కూడా కాదు.. మరి ఎందుకు మేడారం ఒకసారిగా వార్తల్లో నిలిచిందంటే.. బుధవారం ఉదయం ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కనిపించింది. ఇది భూకంపమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే రిక్టర్ స్కేల్ పై 5.3(మాగ్ని ట్యూడ్) గా నమోదయిందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కేవలం మేడారం మాత్రమే కాకుండా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు రకరకాలుగా చర్చించుకోవడం మొదలైంది. భూమి అలా కంపించడం తో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ములుగు జిల్లాలో మేడారం కేంద్రంగా భూమి కంపనాలకు గురైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇది రిక్టర్ స్కేల్ పై 5.3 (మాగ్ని ట్యూడ్) గా గుర్తించామని వారు వివరిస్తున్నారు..” వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి ఒక్కసారిగా కంపించింది. వరంగల్ నగరంలో ఐదు నుంచి 15 సెకండ్ల వరకు భూమిలో స్వల్ప కదలికలు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇది నగర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు బయటకు తీశారని” మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ మాత్రమే కాకుండా రంగారెడ్డి, హైదరాబాదులోని హయత్ నగర్, వనస్థలిపురం, నార్సింగి, కూకట్ పల్లి, అబ్దుల్లా పూర్ మెట్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాలలో భూమిలో ప్రకంపనలు చోటుచేసుకు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలోనూ భూ ప్రకంపనలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఏడు గంటల 27 నిమిషాలకు ఒక్కసారిగా భూమిలో అనూహ్యమైన కదలికలు ఏర్పడ్డాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉప తాలూకా వ్యాప్తంగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందని తెలుస్తోంది. మానుకోట జిల్లా గంగారంలోని భూమి లో అనూహ్యమైన కదలికలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్లు కిందపడిపోయారని సమాచారం. కరీంనగర్ జిల్లాలోని విద్యానగర్లో నిలుచున్నవారు ఒక్కసారిగా కూల పడిపోయారు. సుల్తానాబాద్, హుజురాబాద్, గోదావరిఖని ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. విజయవాడ నగరంలోనూ కొన్ని సెకండ్లు భూమి కంపించింది. జగ్గయ్యపేట, నున్నా ప్రాంతాలలోనూ ఇలానే జరిగింది. అపార్ట్మెంట్లు, ఇళ్ళలో ఉన్న వారు బయటికి వచ్చారు. జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం ప్రాంతాలలోనూ 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని తెలుస్తోంది.
భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి. ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. భూమిలో ప్రకంపనల వల్ల బుధవారం ఉదయం ఏడు గంటల 27 నిమిషాలకు మేడారం సమ్మక్క సారక్క ఆలయం ఒక్కసారిగా ఊగిపోయింది.#medaram#Telangana #earthquake pic.twitter.com/wMjomdJ7ch
— Anabothula Bhaskar (@AnabothulaB) December 4, 2024