The Conjuring Last Rites Collections: హాలీవుడ్ మూవీస్ లో మన ఇండియన్స్ అమితంగా ఇష్టపడే సిరీస్ లలో ఒకటి ‘కాంజురింగ్’. హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం 2013, జులై 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి సాధారణమైనది కాదు. చాలా కాలం తర్వాత ఒక మంచి హారర్ సినిమా చూశాము అనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరిలో కనిపించింది. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడం తో రెండవ భాగాన్ని 2016 జూన్ 10 న విడుదల చేశారు. ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత మూడవ భాగాన్ని 2021 జూన్ 4 న విడుదల చేయగా, నాల్గవ భాగాన్ని, అనగా చివరి భాగాన్ని(The Conjuring – Last Rites) నిన్న గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక హాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు చూసి చాలా రోజులు అయ్యిందని అంటున్నారు. నిన్న ఈ చిత్రం తో పాటు సౌత్ లో ఘాటీ, మదరాసి వంటి భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటికంటే కూడా ‘కంజూరింగ్’ చిత్రానికే మొదటి రోజు ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఇది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 18 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కేవలం సౌత్ నుండే కాదు, ఈ చిత్రానికి నార్త్ ఇండియా లో కూడా ‘భాగీ 4’ లాంటి భారీ చిత్రంతో క్లాష్ వచ్చింది. అయినప్పటికీ కూడా డామినేషన్ చూపించింది అంటే ఈ సినిమా పై ఆడియన్స్ కి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిన్న ఈ చిత్రం మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంగ్లీష్ భాషలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది. 2D ఫార్మటు స్క్రీన్స్ లో ఈ చిత్రం ఓవరాల్ గా 61 శాతం ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకుంది. మార్నింగ్ షోస్ కి కేవలం 44 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది, కానీ రాత్రి షోస్ కి ఏకంగా 78 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. హిందీ వెర్షన్ లో కూడా ఈ చిత్రం భారీ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా హిందీ వెర్షన్ కి మొదటి రోజున 49 శాతం ఆక్యుపెన్సీ వచ్చిందట. ఇక మిగిలిన ఫార్మట్స్ లో 4Dx ఫార్మటు లో ఏకంగా 91 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 2200 స్క్రీన్స్ దొరికాయి. హాలీవుడ్ చిత్రానికి, అది కూడా హారర్ జానర్ చిత్రానికి ఈ రేంజ్ థియేటర్స్ దొరకడం ఈమధ్య కాలం లో ఎప్పుడు చూడలేదు ట్రేడ్ పండితులు.