Allu Arjun : ఐకాన్‌’కు చెక్ పెట్టనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!

Allu Arjun : గత నాలుగేళ్ల క్రితం దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న “ఐకాన్” చిత్రాని అగ్ర నిర్మాత దిల్ రాజ్ ప్రొడక్షన్ లో అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే.అయితే బన్నీ ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ పెట్టుకుని కొంత హడావుడి కూడా చేశాడు. తీరా చూస్తే ఈ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. ఇటీవలే విడుదలైన “వకీల్ సాబ్” సినిమా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాడు దర్శకుడు వేణు. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 7, 2021 4:45 pm
Follow us on

Allu Arjun : గత నాలుగేళ్ల క్రితం దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న “ఐకాన్” చిత్రాని అగ్ర నిర్మాత దిల్ రాజ్ ప్రొడక్షన్ లో అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే.అయితే బన్నీ ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ పెట్టుకుని కొంత హడావుడి కూడా చేశాడు. తీరా చూస్తే ఈ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. ఇటీవలే విడుదలైన “వకీల్ సాబ్” సినిమా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాడు దర్శకుడు వేణు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బన్నీ వేణు శ్రీరామ్ అతి త్వరలో ‘ఐకాన్’ మొదలవుతుందంటూ వార్తలు వచ్చాయి. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ పూర్తయిన తర్వాత స్టైలిష్ స్టార్ చేసే సినిమా ఇదే అనుకున్నారు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు సినిమా వర్గాలలో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడేమో ఈ సినిమాను పూర్తిగా ఆపేస్తున్నారు అని చెబుతున్నారు.

బన్నీ తన 21వ సినిమాను బోయపాటి శ్రీనుతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్‌బస్టర్ అయినది తెలిసిందే.ఆ తర్వాత బోయపాటి జయ జానకి నాయక,వినయ విధేయ రామ, వంటి సినిమాలను డిజాస్టర్ అయినవి. నటసింహం బాలయ్య తో ” అఖండ” చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బోయపాటి కొత్త కథను బన్నీకి చెప్పారట లైనప్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్లు కూడా చెప్పాడట బన్నీ.తన తదుపరి సినిమాను బోయపాటి తో చేయనున్నారు స్టైలిష్ స్టార్ ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్ బేనర్లోనే తెరకెక్కనుందట ‘ఐకాన్’ సినిమా పూర్తిగా పుల్ స్టాప్ పెట్టి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.