Homeఎంటర్టైన్మెంట్Suman: తమ డిమాండ్ నెరవేర్చకపోతే పార్లమెంటును ముట్టడిస్తాం అంటున్న హీరో సుమన్

Suman: తమ డిమాండ్ నెరవేర్చకపోతే పార్లమెంటును ముట్టడిస్తాం అంటున్న హీరో సుమన్

Suman: తెలుగు సినీ పరిశ్రమలో హీరో సుమన్ కి ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పాలి హీరోగా విలన్ గా సైడ్ క్యారెక్టర్ వంటి ఎన్నో పాత్రలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు హీరో సుమన్ అయితే ఇప్పుడు రాజకీయపరంగా కూడా తనదైన వైఖరిని చూపిస్తున్నారు సుమన్. అయితే కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని అంటున్నారు బీసీ నేత,నటుడు సుమన్.ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల గణనను చేపట్టాలని కోరుతూ జోరువాన లో సైతం బీసీలు అంత ఐక్యంగా ఉండి చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రను జయప్రదం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ కుల గణన పై ఆరు రాష్ట్రాలు పైగా తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు పైగా తమ మద్దతు ప్రకటించాయి అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షం గా ఏర్పాటు అయ్యి కేంద్ర ప్రభుత్వానికి తమ హక్కులను తెలియజేయాలని చెప్పారు.బీసీలు అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని, కుల గణన ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ఆయన స్పందిస్తూ,సీఎం జగన్ పరిపాలనను తాము చూస్తున్నామని, ప్రభుత్వానికి ఇంకా సమయం చాలా ఉందని ఆయన పరిపాలన లో భాగంగా మార్పులు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.తమ డిమాండ్ ను నెరవేర్చకుంటే రానున్న డిసెంబర్లో పార్లమెంటును ముట్టడి చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం కేశన శంకర్ రావు,జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version