Homeఎంటర్టైన్మెంట్Manu Charitra: "మ‌ను చరిత్ర" మేఘా ఆకాశ్,శివ కందుకూరికి లక్ ఇస్తుందా!

Manu Charitra: “మ‌ను చరిత్ర” మేఘా ఆకాశ్,శివ కందుకూరికి లక్ ఇస్తుందా!

Manu Charitra: టాలీవుడ్ కు” లై ” సినిమాతో పరిచయం అయ్యింది మేఘా ఆకాశ్ తన నటనతో మంచి గుర్తింపు పొందింది హీరోయిన్ మేఘా.”చూసి చూడంగానే ” అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు శివ కందుకూరి.శివ కందుకూరి హీరోగా మేఘా ఆకాశ్ ఫీమేల్‌ లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం “మ‌ను చరిత్ర” లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లో శివ కందుకూరి,మేఘా ఆకాశ్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ కి ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు,రాన్సన్ జోసెఫ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీగా అలరించబోతోంది.

megha-akash-movie-manu-charitra-movie-shooting-going-to-complete-very-soon

అయితే ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కులను అలరించనుంది ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లూక్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ చివరిదశలో ఉంది అందుకోసం సినిమా ప్రమోషన్ ను వేగవంతం చేస్తుంది చిత్ర బృందం ‌.

ఈ చిత్రం నుండి ఇటీవలే ఒక సాంగ్ విడుదలైంది అన్ని వర్గాలకు ప్రేక్ష‌కుల‌ను నచ్చేలా ఈ పాట అలరిస్తుంది “కనబడకనే తెగ తిరుగుతు నను వెతికిన….. అంటూ మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ పాట.ఈ చిత్రంలో నిత్యామీనన్, శ్రియ, ప్రియాంక జవాల్కర్ తదితర నటులు నటిస్తున్నారు చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో అనేది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version