https://oktelugu.com/

Producer Ram Achanta: నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అఖిల్ తో సినిమా చెయ్యడమే – ఏజెంట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

రామ్ ఆచంట కి తన కెరీర్ లో ఇలాంటి నష్టాలను కలిగించిన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో , ఆయన నిర్మాణం లో విడుదలైన రీసెంట్ చిత్రం 'సామజవరగమనా' మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా కి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.

Written By: , Updated On : July 14, 2023 / 08:42 AM IST
Producer Ram Achanta

Producer Ram Achanta

Follow us on

Producer Ram Achanta: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సినిమాలలో ఒకటి అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం . సుమారుగా 80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

రామ్ ఆచంట కి తన కెరీర్ లో ఇలాంటి నష్టాలను కలిగించిన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో , ఆయన నిర్మాణం లో విడుదలైన రీసెంట్ చిత్రం ‘సామజవరగమనా’ మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా కి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.

ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత రామ్ అచ్చంట మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘రెండు నెలల క్రితం నేను నిర్మించిన ఏజెంట్ చిత్రం భారీ ఫ్లాప్ గా నిలిచి ఘోరమైన నష్టాలను తెచ్చిపెట్టింది. నా జీవితం లో చేసిన అతి పెద్ద పొరపాటు ఆ సినిమాని నేను నిర్మించడం. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేలోపు అందరూ నా పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ లో టాప్ నిర్మాతల నుండి హీరోల వరకు అందరూ నాకు అండగా నిలబడి, ఫోన్లు చేసి ఏమి నిరాశ చెందొద్దు, కచ్చితంగా నువ్వు రాబొయ్యే రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతావు అని ప్రోత్సహించారు. వాళ్ళందరూ ఇచ్చిన ఆశీర్వాదం వల్లే నేడు మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది’ అంటూ ఎమోషనల్ గా రామ్ అచ్చంట మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.