https://oktelugu.com/

Rashmika Mandanna- Nithiin: నితిన్ మూవీ నుండి రష్మిక తప్పుకోవడానికి అతడే కారణం? ఆమె వెనుక ఇంత జరుగుతుందా?

ఒకటి రెండు రోజులు షూటింగ్ కూడా చేసిన రష్మిక నితిన్ కి షాక్ ఇచ్చారనేది తాజా వార్త. ఆమె నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. అసలు విషయం డేట్స్ కాదు. ఆమె మాజీ మేనేజర్ వలనే ఇదంతా జరిగిందంటున్నారు. చాలా కాలం రష్మిక వద్ద కిరణ్ అనే వ్యక్తి మేనేజర్ గా వర్క్ చేశాడు. అతడు రష్మికను మోసం చేశాడని, రూ. 80 లక్షల వరకు కాజేశాడని, దాంతో అతన్ని ఆమె తొలగించారని వార్తలు వచ్చాయి.

Written By: , Updated On : July 14, 2023 / 08:32 AM IST
Rashmika Mandanna- Nithiin

Rashmika Mandanna- Nithiin

Follow us on

Rashmika Mandanna- Nithiin: స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ఈ ఏడాదిర్ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. రైన్ బో టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. శాకుంతలం ఫేమ్ మోహన్ దేవ్ ఆమెకు జంటగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే నితిన్ కి జంటగా ఆమె ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. చిత్రీకరణ మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి రష్మిక తప్పుకున్నారనేది టాలీవుడ్ వర్గాల వాదన. డేట్స్ అడ్జెస్ట్ కాకనే మూవీ చేయలేకపోతున్నానని ఆమె వివరణ ఇచ్చారట.

ఒకటి రెండు రోజులు షూటింగ్ కూడా చేసిన రష్మిక నితిన్ కి షాక్ ఇచ్చారనేది తాజా వార్త. ఆమె నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. అసలు విషయం డేట్స్ కాదు. ఆమె మాజీ మేనేజర్ వలనే ఇదంతా జరిగిందంటున్నారు. చాలా కాలం రష్మిక వద్ద కిరణ్ అనే వ్యక్తి మేనేజర్ గా వర్క్ చేశాడు. అతడు రష్మికను మోసం చేశాడని, రూ. 80 లక్షల వరకు కాజేశాడని, దాంతో అతన్ని ఆమె తొలగించారని వార్తలు వచ్చాయి.

ఈ కథనాల మీద రష్మిక స్పందించారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ప్రతిఒక్కరూ కెరీర్లో ఎదగాలనుకుంటారు. అందుకే మేము ఎవరి దారులు వారు చూసుకున్నాం. విడిపోయాము. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. అప్పటితో ఆ గొడవ ముగిసిందనుకుంటున్న తరుణంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. మాజీ మేనేజర్ కిరణ్ ఆమె గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆమెకు టాలీవుడ్ మీద ఆసక్తి లేదు. బాలీవుడ్ లో ఎదగాలని చూస్తున్నారంటూ దర్శక నిర్మాతల వద్ద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారట.

ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన రష్మిక నితిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా రష్మిక ఓపెన్ కాలేదు. అసలు నితిన్ ప్రాజెక్ట్ చేస్తున్నదీ లేనిదీ చెప్పలేదు. దీంతో ఒక సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం ఇక పుష్ప వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దిగుతుందని అంటున్నారు.