https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఎపిసోడ్ ని సగం లేపేసిన బిగ్ బాస్ టీం..ప్రూఫ్స్ ఇవే..సోనియా ని కాపాడేందుకు ఇంత కష్టపడాలా?

ఈ శనివారం ఎపిసోడ్ మాత్రం 10 నిమిషాలకు ముందే ముగుస్తుంది. దీని అర్థం కచ్చితంగా ఎపిసోడ్ కి సంబంధించిన 10 నిమిషాలు కట్ చేసి టెలికాస్ట్ చేసారు అనేది స్పష్టం గా అర్థం ఆడియన్స్ కి అర్థం అయ్యింది. ప్రోమో చూపించిన భాగం వరకే ఎపిసోడ్ లో చూపించడం గమనార్హం. ఇందులో నాగార్జున తప్పు లేదు, ఆయన డ్యూటీ ఆయన చేసాడు, కానీ బిగ్ బాస్ టీం దానిని చూపించకుండా కప్పేసింది

Written By:
  • Vicky
  • , Updated On : September 22, 2024 / 09:15 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  అభయ్ ఈ వారం లో బిగ్ బాస్ పై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసాడు. వాటిని సమర్దించట్లేదు కానీ, ‘బిగ్ బాస్ బయాసిడ్’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ని మాత్రం సమర్దించకుండా ఉండలేము. ఎందుకంటే హాట్ స్టార్ తో లైవ్ ప్రసారం అవుతుంది. ఆ లైవ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ జనాల దృష్టిలో బాగా నెగటివ్ అయ్యేలా ఉంటుంది. వాటిని బిగ్ బాస్ టీం ఎడిటింగ్ లో పీకేసి, కేవలం వాళ్లకు కావాల్సింది మాత్రమే టీవీ టెలికాస్ట్ లో చేస్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. అయితే గత సీజన్ లో పని చేసిన పీసీఆర్ టీం ఇప్పుడు లేదు. ఆ ప్రభావం ఎడిటింగ్ లో ఉంది, అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అనేది కొందరి వాదన. నిన్నటి ఎపిసోడ్ లో ఒక పెద్ద తప్పిదమే జరిగింది. మనకి విడుదల చేసిన ప్రోమో లో నాగార్జున నిఖిల్ ని ప్రశ్నిస్తూ ‘మీ క్లాన్ లో అమ్మాయిలలో ఎవరు బాగా ఆడారు అని నీకు అనిపించింది’ అని అడగగా, నిఖిల్ సీత పేరు చెప్తాడు.

    అప్పుడు నాగార్జున మాట్లాడుతూ ‘మరి రెడ్ ఎగ్ సీతకు ఇవ్వకుండా సోనియా కి ఎందుకు ఇచ్చావ్’ అని అంటాడు. ఇది ప్రోమో లో చూడగానే ఆడియన్స్ ‘అబ్బా..ఏమైనా అడిగాడా ప్రశ్న..బిగ్ బాస్ హిస్టరీ లోనే ది బెస్ట్ ఎపిసోడ్ లోడింగ్’ అంటూ ప్రేక్షకులు యూట్యూబ్ లో ఆ ప్రోమో వీడియో క్రింద కామెంట్స్ పెట్టారు. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత షాక్ తిన్నారు. ఎపిసోడ్ లో నాగార్జున ఈ ప్రశ్న అడుగుతాడు, కానీ ఆ తర్వాత దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం కూర్చోండి అంటాడు. కానీ ఆ అంశం గురించి మళ్ళీ ప్రస్తావించడు నాగార్జున. ఆయన కచ్చితంగా ఈ సంఘటన గురించి కొనసాగింపుగా ప్రశ్నలు అడిగే ఉంటాడు. కానీ బిగ్ బాస్ టీం వాటిని ఎడిటింగ్ లో కట్ చేసి టెలికాస్ట్ చేసారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో 9 గంటలకు ప్రారంభమైయ్యే బిగ్ బాస్ షో 10:30 వరకు కొనసాగుతుంది.

    కానీ ఈ శనివారం ఎపిసోడ్ మాత్రం 10 నిమిషాలకు ముందే ముగుస్తుంది. దీని అర్థం కచ్చితంగా ఎపిసోడ్ కి సంబంధించిన 10 నిమిషాలు కట్ చేసి టెలికాస్ట్ చేసారు అనేది స్పష్టం గా అర్థం ఆడియన్స్ కి అర్థం అయ్యింది. ప్రోమో చూపించిన భాగం వరకే ఎపిసోడ్ లో చూపించడం గమనార్హం. ఇందులో నాగార్జున తప్పు లేదు, ఆయన డ్యూటీ ఆయన చేసాడు, కానీ బిగ్ బాస్ టీం దానిని చూపించకుండా కప్పేసింది. ఆడియన్స్ కి ఇష్టం లేని అంశాలు షోలో కొనసాగితే అది టీఆర్ఫీ రేటింగ్స్ మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. సీజన్ 6 లో అలా జరగడం వల్లే అది అతి పెద్ద డిజాస్టర్ సీజన్ గా నిల్చింది, ఈ సీజన్ ప్రస్తుతానికి మంచి రేటింగ్స్ తోనే దూసుకుపోతుంది, కానీ ఇలాంటి రిపీట్ తప్పులు చేసుకుంటూ పోతే మాత్రం ఇది కూడా సీజన్ 6 లాగా ఫ్లాప్ అవ్వక తప్పదు.