Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరిని నాగార్జున ఒకేలా చూస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టీం నాగార్జున కి ఇచ్చే స్క్రిప్ట్ కొంతమంది కంటెస్టెంట్స్ ని ఉద్దేశపూర్వకంగా కాపాడుతున్నట్టు అనిపిస్తాది. ఈ సీజన్ లోనే కాదు, ప్రతీ సీజన్ లోను ఇలా జరుగుతూనే ఉంది. దీనినే మ్యానేజ్మెంట్ కోటా అని అంటుంటారు. అలా ఈ సీజన్ లో బిగ్ బాస్ సోనియా ని కాపాడేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడని చాలా మందికి అనిపించింది. ఆమె వల్ల హౌస్ లో రెండు లవ్ ట్రాక్స్ నడుస్తుంది. నిఖిల్, పృథ్వీ రాజ్ తో ఆమె ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నట్టుగా జనాలకు ప్రొజెక్ట్ అయ్యింది. దీని వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ కూడా పెరిగింది. బహుశా దాని కోసమే బిగ్ బాస్ సోనియా చేసే తప్పులను కప్పిపుస్తున్నాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలిగింది.
నాగ మణికంఠ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అమ్మాయిలతో ఆ హగ్గులు ఏంటి అని అడగడం లో తప్పు లేదు, ఎందుకంటే ఆయన నిజంగానే అలా చేసాడు. అయితే మణికంఠ వ్యవహారం కళ్ళకు కనిపించిన నాగార్జునకు, సోనియా చేస్తున్నది కనపడలేదా?..ఆమె వల్ల ఇద్దరు బలమైన కంటెస్టెంట్స్ ప్రభావితం అవుతున్నారు, వాళ్ళ మీద ఈమె ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంది. ఇవి ఆడియన్స్ కి చూసేందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో లో ఇలాంటివి జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత నాగార్జునదే కదా, ఎందుకు ఆయన ఆపలేదు అని ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ వారం బెలూన్స్ టాస్క్ కు సంచాలక్ గా సోనియా వ్యవహరిస్తుంది. ఈ టాస్కు లో అభయ్, నిఖిల్ హోరాహోరీగా తలపడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ టాస్కులో నిఖిల్ గెలుస్తాడు. అభయ్ కి అన్యాయం జరిగింది అని ఆ క్లాన్ కి సంబంధించిన వారికి అనిపించింది. ఈ టాస్కులో సోనియా సంచాలక్ గా 50 శాతం కరెక్ట్ అయితే, 50 శాతం తప్పు. అభయ్ కి గీత దాటి బయటకి రాకూడదు అని అనేక సార్లు చెప్పింది. అతను మాట వినకుండా అడ్డదిడ్డంగా గేమ్ ఆడాడు.
అంతే కాదు స్టిక్ తో కాకుండా చేతులతో కూడా ఆయన చాలా బెలూన్స్ ని పగలగొట్టాడు, అలా అభయ్ ఎక్కువ తప్పులు చేసాడు కాబట్టి సోనియా నిఖిల్ ని విన్నర్ గా ప్రకటిస్తుంది. ఇదంతా కరెక్ట్ గానే ఉంది. కానీ క్రిందపడిపోయిన బెలూన్స్ లో సోనియా ఎక్కువగా ఆమె క్లాన్ కి సంబంధించిన బెలూన్స్ ని గీత లోపలకు పంపుతుంది. అవతల యష్మీ మావి కూడా లోపలకు పంపించు అని ఎంత అరిచినా పంపించదు, వాళ్ళ క్లాన్ కి సంబంధించిన బెలూన్స్ ని చాలా తక్కువగా లోపలకు పంపుతుంది. దీనిపై యష్మీ ఆరోజు సోనియా ని నిలదీసి పెద్ద గొడవ పెట్టుకుంటుంది, ఇదే విషయాన్ని నిన్న ఆమె నాగార్జున కి కూడా చెప్పాలని పైకి లేస్తుంది, కానీ నాగార్జున ఆమెని కూర్చోబెట్టేసాడు, ఇది కచ్చితంగా సోనియా తప్పులు కవర్ చేయడం కాక మరేంటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.