spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood: వరుస అవకాశాలు వస్తున్న అన్ని ఫ్లాప్ అవ్వడంతో దెబ్బకు సైలెంట్ అయిపోయిన బ్యూటీ

Tollywood: వరుస అవకాశాలు వస్తున్న అన్ని ఫ్లాప్ అవ్వడంతో దెబ్బకు సైలెంట్ అయిపోయిన బ్యూటీ

Tollywood: ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అవకాశాలతో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీ లోకి అడిగిపెట్టి కేవలం ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాక చాలా కష్టాలు పడుతున్నారు.సినిమా ఇండస్ట్రీలో అవకాశాన్ని అందుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు అవకాశాన్ని అందుకున్న కూడా సక్సెస్ సాధించడం కూడా అంత సులభమైన పని కాదు. చాలామంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా అవకాశాలు అందుకొని సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. అలాగే మరి కొంతమంది మాత్రం అందచందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నా కూడా అదృష్టం కలిసి రాక చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతున్నారు. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించినప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాక ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయింది.

కావ్య థాపర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మాయ పేరేమిటో అని సినిమాతో 2018లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ చిన్న దానికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈమె చేసిన తొలి సినిమా డిజాస్టర్ అయిన కూడా వరుస అవకాశాలను అందుకుంది. కావ్య ఏక్ మినీ కథ అనే సినిమాతో 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిడిల్ క్లాస్ లవ్ అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. పిచ్చై కారన్ 2 అనే సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగులో ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఈస్మార్ట్, విశ్వం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో ఈమెకు మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. కావ్య థాపర్ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోతుంది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాక సైలెంట్ అయిపోయింది. దాంతో ఈ బ్యూటీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం కావ్య థాపర్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తన గ్లామర్ ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాలలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version