Photo Story: తెలుగు సినీ ఇండస్ట్రీలో గతేడాదిగా నటీమణుల కొరత వేధిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు అనుకున్న సినిమాలకు తగిన హీరోయిన్లు దొరకడం లేదు.ఈ క్రమంలో ఇప్పుడిప్పడే వస్తున్న వారికి డిమాండ్ ఏర్పడుతోంది. వీరు నటిస్తున్న సినిమాలు హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వారి రెమ్యూనరేషన్ కూడా ఆమాంతం పెరిగిపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి ఏడాది కూడా పూర్తి చేసుకోని ఓ భామ రెమ్యూనరేషన్ మొన్నటి వరకు లక్షల్లో ఉండేది.. ఇప్పుడు సెవెన్ డిజిట్ కు మారిపోయిందట. ఆమె పారితోషికం ఎక్కువైనా పర్వాలేదు గానీ ఆమె డేట్స్ కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఈ క్రమంలో ఆమె చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
నడుము వొంపు సొంపులతో కుర్రాళ్ల గుండెళ్లో గుబులు పుట్టించే విధంగా డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఆ భామ ఎవరో కాదు శ్రీలీల. అప్ కమింగ్ సినిమాల్లో దాదాపుగా శ్రీలీల ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి తీవ్ర చర్చ సాగుతోంది. శ్రీలీల 2001 జూలై 14న అమెరికాలో జన్మించారు. అమె తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆమె భరత నాట్యం నేర్చుకున్నారు. ఆ తరువాత ఎంబీబీఎస్ చేస్తున్నారు.
ఈ సమయంలో ఆమెకు కన్నడ మూవీ ‘కిస్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈమె నటన మెచ్చన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగులో ‘పెళ్లిసందD’లో అవకాశం ఇచ్చారు. 2021 లో దసరా కానుకగా వచ్చిన ఈమూవీ అనుకున్న విజయం సాధించకపోయినా ఆమె నటన, డ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఆ తరువాత శ్రీలీలకు ఆఫర్లు తలుపుతట్టాయి.
రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’లో శ్రీలీల పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా పల్సర్ బైక్ సాంగ్ లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఆ తరువాత శ్రీ లీల బాలకృష్ణ సినిమాలో నటిచే ఆఫర్ కొట్టేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మేకింగ్ లో ఉంది. ఇవే కాకుండా మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలతో పాటు పలు సినిమాలను లైన్లోపెట్టింది.
సినిమాలు హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా శ్రీలీలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ అమాంతం పెరిగింది. ఆమె తెలుగు సినిమా ‘పెళ్లిసందD’కి రూ.30 లక్షలు తీసుకోగా.. మొన్నటి ధమాకా తరువాత కోటి రూపాయల వరకు పెంచేసిందట. ఇప్పుడు అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేయడంతో శ్రీలీల తొందర్లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందా? ని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఆమె చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె భరత నాట్యకారణి. ఓ ప్రదర్శన ఇచ్చే సమయంలో ఆమె ఈ పిక దిగినట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల చేస్తున్న ఎంబీబీఎస్ త్వరలో పూర్తి కానుంది. దీంతో ఆమె తల్లి బాటలోనే డాక్టర్ గా మారనుంది. ఓ వైపు డాక్టర్ గా.. మరోవైపు యాక్టర్ గా శ్రీలీల రెండు రంగాల్లో ఎలా విజయం సాధిస్తుందో చూడాలి.