https://oktelugu.com/

Bhola Shankar Release Postponed: మెగాస్టార్ ‘భోళా శంకర్’ విడుదల వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్

రీసెంట్ గా విడుదలైన అఖిల్ 'ఏజెంట్' చిత్రానికి కూడా అనిల్ సుంకర నే నిర్మాత. ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు 'భోళా శంకర్' చిత్రం పై ప్రభావం చూపిస్తుంది.

Written By: , Updated On : May 2, 2023 / 09:58 AM IST
Follow us on

Bhola Shankar Release Postponed: ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ సినిమా ‘వేదలమ్’ కి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. 8 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా తమిళ నాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాని మెగాస్టార్ ఇమేజి కి తగట్టుగా, తెలుగు ఆడియన్స్ నేటివిటీ కి మ్యాచ్ అయ్యే విధంగా ఎన్నో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఆగష్టు 11 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాత అనిల్ సుంకర ఇది వరకే తెలియచేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కొన్ని ముఖ్యమైన పనులు బ్యాలన్స్ ఉండడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి, అంతా అనుకున్న విధంగానే జరుగుతుంది కదా, ఇక వాయిదా వేయాల్సిన అవసరం ఏముంది అని మీరు కావొచ్చు. కానీ రీసెంట్ గా విడుదలైన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రానికి కూడా అనిల్ సుంకర నే నిర్మాత. ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రం పై ప్రభావం చూపిస్తుంది.

ఏజెంట్ బయ్యర్స్ అందరూ మాకు నష్టపరిహారం చెల్లించే వరకు, అనిల్ సుంకర నుండి ఎలాంటి సినిమా కొనబోమని, అలాగే ఆయన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారట. ఇలాంటి పరిస్థితిలో ఆగష్టు లోపు వాళ్ళ నష్టపరిహారాన్ని తీర్చే చాన్సు లేకపోవడం తో ‘భోళా శంకర్’ అని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.