Rajinikanth Vs YCP Leaders: ఎలుక దూరిందని ఇంటినే కాల్చేయమన్నట్టుంది ఏపీలో వైసీపీ నేతల దుస్థితి. అన్న ఎన్టీ రామారావుపై అభిమానంతో ఆయన శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఆయనపై గౌరవం కొలదీ మాట్లాడారు. అటు స్నేహితుడు చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆయన విజనరీని కొనియాడారు. పాపం అక్కడ నుంచి రజనీని వైసీపీ మంత్రులు, నేతలు వెంటాడుతునే ఉన్నారు. హీరో కాదు జీరో అని.. సన్నాసి అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ ను పట్టుకొని వైసీపీ టీం అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రత్యర్థులు కాదు శత్రువులు..
ఏపీలో ఇప్పడు రాజకీయ ప్రత్యర్థులు లేరు.. వారిని శత్రువులుగానే ట్రీట్ చేస్తున్నారు. అంతా గ్రామస్థాయి రాజకీయాలనే చేస్తున్నారు. పక్క పార్టీ వాడితో మాట్లాడకూడదు. సన్నిహితంగా మెలగకూడదు. విజయసాయిరెడ్డి విషయంలో ఇదే జరిగింది. జాగ్రత్తగా సైడ్ చేసిన విషయం వెల్లడైంది. రాజకీయ ప్రత్యర్థులను నోటికొచ్చినట్టు తిడతారు. అవసరమైతే భౌతిక దాడులు చేస్తారు. అంతకీ వీలుకాకపోతే కేసుల్లో ఇరికించి.. రోజంతా వాహనాల్లో తిప్పించి పైశాచిక ఆనందం పొందుతారు.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే. స్నేహితుడు చంద్రబాబు పిలిచారని రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ చేసి ఎన్టీఆర్ గురించి గొప్ప మాటలు చెప్పారు. పనిలో పనిగా చంద్రబాబుని పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో సహజంగానే వైసీపీ నేతలకు ఇది మండింది. రజినీకాంత్ ని చెడామడా తిట్టేశారు. వెన్నుపోటుదారుడని, మోసగాడని, రోగిష్టి అని.. నానా మాటలన్నారు.
ఓ రేంజ్ లో ఫైర్..
కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా ఇలా అందరూ రంగంలోకి దిగారు. చెడామడా తిట్టేశారు. ఆయనొక సూపర్ స్టార్ అన్న విషయాన్నే మరిచిపోయారు. కొడాలి నాని ఏకంగా జీరోగా సంబోధించారు. అందరూ ఒకే లైన్ తీసుకొని మాట్లాడడం చూస్తుంటే వెనుక హైకమాండ్ ఆదేశాలున్నట్టు స్పష్టమైంది. రజనీకాంత్ చంద్రబాబు పాలనను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి చేరకుండా ఉండేందుకు వైసీపీ నేతల ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే శృతిమించిన తిట్ల దండకంతో రజనీని ఆడి పోసుకున్నారు.
అడ్డగోలు సమర్థన..
అయితే లోలోపల పురమాయించొచ్చు. కానీ బయటకు మాత్రం నియంత్రించినట్టే చూడాలి కదా. కానీ వైసీపీ అడ్డగోలుగా సమర్థించుకుంది. చంద్రబాబును పొగిడితే తిడతామని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు. సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది.
సర్వత్రా విమర్శలు..
ఇక్కడ రజనీకాంత్ టార్గెట్ కాదు. ఆయన నోటి నుంచి వచ్చిన పొగడ్తలే వైసీపీ బ్యాచ్ కునచ్చలేదు. అదే సూపర్ స్టార్ కు శాపంగా మారింది. జగన్ ను ఎంతో మంది పొగుడుతూంటారు. వారెవర్నీ టీడీపీ ఏమీ అనలేదే. ఏమైనా విమర్శలు ఉంటే పద్దతిగా చేయాలి కానీ.. ఆరోగ్య సమస్యల దగ్గర్నుంచి కుటుంబాల్లో మనుషుల వరకూ తీసుకొచ్చి తిడతారా ?. ఇంత లేకి మనస్థత్వం ఉన్న పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించారని .. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు జాలిగా చూసే పరిస్థితులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు అదే అంశం హాట్ టాపిక్ అవుతోంది.