Homeఎంటర్టైన్మెంట్Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ని హాస్పిటల్ కి చేర్చిన ఈ ఆటో...

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ని హాస్పిటల్ కి చేర్చిన ఈ ఆటో డ్రైవర్ కి భారీ రివార్డు..ఎంత డబ్బులిచ్చారో చూస్తే ఆశ్చర్యపోతారు!

Saif Ali Khan Met Auto Driver:సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ఇప్పుడు ప్రస్తుతం కుదుటపడింది. మంగళవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి హలో చెప్పాడు. అనంతరం సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ను కలిసినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీ ఖాన్
సైఫ్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాతో కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటో చూస్తే సైఫ్ మంగళవారం ఆసుపత్రిలో ఆటో డ్రైవర్‌ను కలిశాడని స్పష్టమవుతోంది. ఆ ఫోటోలో సైఫ్ తెల్లటి చొక్కా, డెనిమ్ జీన్స్ ధరించి కనిపిస్తున్నాడు. అతను నల్ల కళ్ళద్దాలు కూడా పెట్టుకుని ఉన్నాడు. సైఫ్ డ్రైవర్ భుజంపై చేయి వేసి, కలిసి కూర్చున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

సైఫ్, ఆటో డ్రైవర్ సంభాషణ
సైఫ్ ఆటో డ్రైవర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కూడా ఆటో డ్రైవర్ కు తన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇలాగే ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయమని ప్రోత్సహించారు. సైఫ్ అలీ ఖాన్ ఆ ఆటో డ్రైవర్ పనిని ప్రశంసించారు. ఇలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండు అని సైఫ్ అన్నాడు. జీవితంలో ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా తనను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. భజన్ సింగ్ రాణాను ఆసుపత్రికి ఎలా చేరుకున్నారని అడిగినప్పుడు మీడియా ప్రతినిధులందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు అతను ముసుగు ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించానని చెప్పాడు.

 

Saif Ali Khan(6)
Saif Ali Khan(6)

బుధవారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ పై ఒక దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ దొంగ సైఫ్ పై ఆరుసార్లు కత్తితో దాడి చేశాడు. సైఫ్ రక్తంతో తడిసిపోయాడు. అతను ఆటోలో లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ సమయంలో సైఫ్ ఇంట్లో డ్రైవర్ లేడు. అందుకే అతను ఆటో ఎక్కాడు. భజన్ సింగ్ రాణా స్వయంగా సైఫ్, అతని కుమారుడు తైమూర్‌ను తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

ఆటో డ్రైవర్ సైఫ్ నుండి డబ్బు తీసుకోలేదు.
ఆ రాత్రి జరిగిన మొత్తం సంఘటన గురించి ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. ‘సైఫ్ మెడ నుండి రక్తం కారుతోంది’ అని డ్రైవర్ అన్నాడు. ‘‘అతని బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. చాలా రక్తం పోయింది. అతను స్వయంగా నా వైపు నడుచుకుంటూ వచ్చారు. అతనితో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. నేను అతన్ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎనిమిది-పది నిమిషాల్లో ఆసుపత్రి చేరుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సైఫ్ అలీ ఖాన్ అని నాకు తెలిసింది.’’ అని ఆటో డ్రైవర్ తెలిపింది. డ్రైవర్ భజన్ సింగ్ రాణా చేసిన సేవకు ఒక సంస్థ 11 వేల రూపాయల రివార్డును అందించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular