Pushpa 2 : నిన్నటి నుండి సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నినేని, అభిషేక్ అగర్వాల్ ఇలా ఎంతో మంది ప్రముఖులపై ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ పై సోదాలు నిర్వహించిన తర్వాత, ఐటీ అధికారులు నేడు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ ఐటీ సోదాల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. పుష్ప 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని, బయట వెల్లడించిన వసూళ్లకు, వాస్తవంగా వచ్చిన వసూళ్ళకి 531 కోట్ల రూపాయిల తేడా ఉందని, డైరెక్టర్ సుకుమార్ లాభాల్లో వాటాలు పంచుకున్నాడని, కానీ వాటికి సంబంధించి టాక్సులు సరిగా చెల్లింపు చేయలేదని అంటున్నారు. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
కేవలం సుకుమార్ వద్ద ఒక్కటే కాదు, నిన్నటి నుండి సోదాలు నిర్వహిస్తున్న చోట్ల అనేక లెక్కలు దొరికాయని, వాటికి ఇన్కమ్ టాక్స్ కట్టలేదని ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. నిన్న పుష్ప 2 నిర్మాతలపై, నేడు డైరెక్టర్ పై సోదాలు నిర్వహించిన అధికారులు, రేపు హీరో అల్లు అర్జున్ పై కూడా సోదాలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. అంటే పుష్ప 2 కి ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కాదు, 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ఐటీ అధికారులు. మరి టాక్స్ కట్టనందుకు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా లేదా అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీ పై వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేసిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతినిందని, అందుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీ పై పెట్టిన శ్రద్ద రాజకీయ నాయకులపై ఎందుకు పెట్టడం లేదు?, వాళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తే ఒక రాష్ట్ర బడ్జెట్ కి సరిపడేంత డబ్బులు బయటకి వస్తాయని అంటున్నారు. ఈమధ్య కాలం లో ప్రతీ చిన్న విషయానికి సినీ ఇండస్ట్రీ పై టార్గెట్ చేస్తున్నారని, మన తెలుగు సినిమా ప్రపంచం నలుమూలల విస్తరించి, అద్భుతాలను నెలకొల్పతున్న ఈ సమయంలో, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్టమని అంటున్నారు. నిర్మాత, దర్శకుడి దాకా వచ్చిన ఐటీ అధికారులు, రేపు అల్లు అర్జున్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా లాభాల్లో వాటాలను పంచుకున్నాడు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. రేపు మరికొంత మంది ప్రముఖులపై కూడా ఐటీ సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.