TV Debate Helmet Video: న్యూస్ చానల్స్ అనేది వచ్చిన తర్వాత డిబేట్స్ నిర్వహించడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ డిబేట్స్ లో పాల్గొనేవారు విషయంతో కాకుండా వాగుడుతోనే ఫేమస్ అవుతున్నారు. విషయం మీద పట్టు లేక.. అరవడంతో టాపిక్ మొత్తాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తద్వారా న్యూస్ ఛానల్స్ ఇటువంటి వ్యవహారాలను విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ తరహాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వ్యూస్ పెంచుకుంటున్నాయి. ఇవి అంతిమంగా ప్రజల్లో వైషమ్యాలకు కారణమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఓ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ఓ నాయకుడు హాజరయ్యారు. చర్చ నిర్వహించే దమ్ము లేక సహనం కోల్పోయి దాడి చేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఇటీవలి కాలంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో ఓ పార్టీ నాయకుడి పై మరో నాయకుడు చెప్పుతో దాడి చేశాడు. ఇక ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ లో ఓ పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిపై దాడి చేశాడు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి రావడంతో సంచలనం నమోదయింది.
ఈ ఘటన నేపథ్యంలో అదే యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమానికి ఓ పార్టీ నాయకుడు హెల్మెట్ ధరించి వచ్చాడు..” డిబేట్ కోసం వస్తే చర్చించే దమ్ము లేక దాడులు చేస్తున్నారు. దూషణలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వ్యక్తులు ఉన్నచోట డిబేట్ కు రావాలంటే భయం వేస్తోంది. అందువల్లే హెల్మెట్ ధరించి వస్తున్నాం.. ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించాల్సి వస్తోందని” ఓ పార్టీ నాయకుడు పేర్కొన్నాడు. అంతేకాదు ఆయన హెల్మెట్ ధరించి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: కాంగ్రెస్ పార్టీ పై హరీశ్ రావు ఫైర్
ఈ వీడియోను ఓ పార్టీ నాయకులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము అడుగుతున్నాం. వాటిని పదేపదే గుర్తు చేస్తున్నాం. ఎన్నికల్లో ఆ హామీలు ఇచ్చి వారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన వారికి లేదు. అందువల్లే అధికార పార్టీ నాయకులకు గుర్తు చేస్తున్నాం. వారికి ఇబ్బందిగా మారినట్టుంది. హామీల గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. అందువల్లే మాకు సహనం నశించిపోతుంది. అందువల్లే దాడులు చేయాల్సి వస్తుందని” ఓ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
“గడిచిన రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ప్రతి హామీని కూడా అసంపూర్తిగానే అమలు చేసింది. నాటి రోజుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే దాడులకు పాల్పడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తోంది. పైగా హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తోంది. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి హామీలు గుర్తుకు లేవా? ఆ హామీలు అమలు చేయకపోవడం వల్లే కదా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదు.. పైగా దాడులకు పాల్పడే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కచ్చితంగా ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా దిమ్మతిరిగే ఫలితం ఇస్తారని” ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే డిబేట్ లలో చర్చకు హాజరయ్య నాయకుడు హెల్మెట్ ధరించి రావడం తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనమని చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్ నాయకులకు భయపడి హెల్మెట్ పెట్టుకొని వచ్చిన కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ https://t.co/fp0RP0JAv4 pic.twitter.com/bpt1eS99lZ
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025