Tollywood movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు ఇప్పుడు ఎక్కువగా డ్యూయల్ రోల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు ఇప్పటికే అఖండ 2(Akhanda 2) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా విశ్వంభర (Vishwambhara) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) సైతం లో డబుల్ రోల్ కనిపించబోతున్నడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి… కింగ్ డమ్ సినిమాలో సైతం విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకని మన స్టార్ హీరోలందరు డ్యూయల్ రోల్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో మన హీరోలు చూపిస్తున్న జాగ్రత్తలను చూస్తుంటే వరుసగా మంచి సక్సెస్ సాధించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక డ్యూయల్ రోల్ లో హీరోలు కనిపిస్తే వల్ల అభిమానులు సైతం ఎక్కువ సంతోషం తో ఉంటారు. కారణం ఏంటంటే ఒక హీరో స్క్రీన్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
Also Read: ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న టాప్ 3 తెలుగు డైరెక్టర్స్ వీళ్లేనా..?
అదే ఇద్దరు హీరోలు ఉంటే ఆయనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎటు చూసినా ఆ హీరోనే కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి తమ అభిమానులు సైతం అతన్ని ఎక్కువ సేపు చూడడానికి ఆస్కారం ఉంటుంది…మన స్టార్ హీరోలందరు ఇప్పటివరకు డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన వారే కావడం విశేషం…
ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం అట్లీతో చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. మొదటిసారి ఆయన డబుల్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: కూలీ సినిమాలో రజినీకాంత్ – నాగార్జున ఇద్దరిలో ఎవరు ఎవరిని డామినేట్ చేయబోతున్నారు…
ఇక రాజాసాబ్ సినిమాలో సైతం ప్రభాస్ డబుల్ రోల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి ఓల్డ్ క్యారెక్టర్ కాగా, మరొకటి యంగ్ క్యారెక్టర్ ని పోషించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ సైతం మంచి విజయాన్ని దక్కించుకోవడానికి చూస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…