Suriya: సూర్య అంటే తమిళ ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంటగానే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు. సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఈ మధ్య తరచుగా ముంబై వెళుతూ ఉండడం చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది బాలీవుడ్ లో కూడా సూర్య తన క్రేజ్ పెంచుకోవడానికి, అక్కడ ఏదో ప్రాజెక్టు ఒప్పుకొని ఉంటారు అనగా మరికొండరేమో సూర్య ఏకంగా తన ఫ్యామిలీని ముంబైకి మార్చేశారు అని అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ముంబై పర్యటనలకు అసలు కారణాన్ని సూర్య వివరించాడు.
తమిళ చిత్రసీమలో ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ప్రేమ జంట అయిన సూర్య, జ్యోతిక, వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2006లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు ఉన్నారు. ఇక ఆ పిల్లల కోసమే ముంబై వెళుతున్నారట ఈ హీరో.
తాను తరచుగా ముంబైలో ఉండడం గురించి వచ్చిన పుకార్లను ప్రస్తావిస్తూ, “నేను ముంబైకి మారినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆ విషయాన్ని నేను స్పష్టం చెయ్యాలి అనుకున్నాను. ఎందుకంటే మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. మా పిల్లలిద్దరూ ముంబైలో చదువుతున్నారు. అందుకే నేను తరచుగా ముంబై వెళ్లాల్సి వస్తుంది” అని సూర్య అన్నారు.
ఈ హీరో ప్రధానంగా తన పిల్లలతో ఉండటానికి, వారికి ఎక్కువగా సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం సూర్య పిల్లలు ముంబైలో చదువుకుంటూ ఉండటం వల్ల, వారు బాగానే ఉన్నారా లేదా అని చూడడానికి తరచుగా ముంబైకి వెళుతున్నారట ఈ హీరో. అయితే తన నివసిస్తూ ఉండేది మాత్రం చెన్నైలోనే అని సూర్య హైలైట్ చేశాడు. “నా ప్రధాన దృష్టి మా పిల్లలకు మంచి తండ్రిగా ఉండటం. అందుకే అక్కడికి వెళ్లి వస్తూ ఉంటాను.”, అని తెలియజేశారు ఈ హీరో.
ఇక సూర్య వివరణ అతను తరచుగా ముంబైకి ఎందుకు వెళ్తాడు, అక్కడికి తన ఫ్యామిలీని ఏమన్నా షిఫ్ట్ చేశారా అనే ఊహాగానాలకు ముగింపు పలికింది.
సినిమాల విషయానికి వస్తే, సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో తన 42వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఫాంటసీగా రానుంది.