Chiranjeevi: ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నాలుగు హిట్స్ వచ్చిన కూడా ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే మాత్రం మళ్లీ వాళ్ళకి సినిమాల్లో మంచి అవకాశాలు అయితే రావు. అలాంటిది ఒక వ్యక్తి ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి ఎవరు తెలియని పరిస్థితిల్లో కూడా ఇక్కడ నిలదొక్కుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి…
ఇక ఈయన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి దాదాపు పది మంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. అందులో అల్లు అర్జున్ ఒకడు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాల పాటు మెగా ఫ్యామిలీ హీరో గానే కొనసాగాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అవ్వడంతో మెగా ఫ్యామిలీని పట్టించుకోకుండా అల్లు ఫ్యామిలీ, అల్లు ఆర్మీ అంటూ అల్లు అర్జున్ తనకంటూ సపరేట్ గా ఎదుగుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అంటు సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ ని సినిమాల్లోకి తీసుకువచ్చిందే చిరంజీవి అలాగే చాలా మంది డైరెక్టర్లను రిఫర్ చేసి అల్లు అర్జున్ తో సినిమాలు చేయించి అతన్ని ఒక స్థాయికి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత చిరంజీవిని అసలు పట్టించుకోవట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకుముందు ఏ ఫంక్షన్ జరిగిన చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆయన చేత ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేయించేవాడు.
కానీ ఇప్పుడు తనకు నచ్చిన వాళ్ళని పిలుచుకుంటూ చాలా హంగామా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి…అలాగే వాళ్ల ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టపబుల్ షో చేస్తున్న బాలయ్య బాబుతో చాలా ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి బాలయ్యకి మధ్య విభేదాలు ఏమీ లేకపోయిన కూడా ఇద్దరు సీనియర్ హీరోలు కాబట్టి ఇద్దరి మధ్య పోటీ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి ని పక్కన పెట్టేసి బాలయ్య బాబుకి చాలా దగ్గరవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక పబ్లిక్ ఫంక్షన్స్ కాకుండా వాళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా చిరంజీవికి నార్మల్ గా అందరికి చెప్పినట్టుగానే చెప్తున్నాడు గాని స్పెషల్ గా మాత్రం ఏం చేయట్లేదు అంటూ మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు.
ఇక ఇదంతా చూసిన మెగా అభిమానులు అల్లు అర్జున్ బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఇంతకుముందు వేరేలా ఉండేవాడు ఇప్పుడు వేరేలా ఉంటున్నాడు.ఆయన ఎలా ఉన్నా చిరంజీవిని ఎవరు పట్టించుకున్న, పట్టించుకోకపోయిన చిరంజీవికి పోయేదేం లేదు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలా ఘాటుగా సమాధానం ఇస్తున్నారు…