https://oktelugu.com/

Renault Kwid: రెనో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మూడు మోడళ్లు.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

రెనో కంపెనీ నుంచి గతంలో రిలీజ్ అయిన డస్టర్ గురించి తెలిసిందే. ఇప్పుడు దానిని అప్డేట్ వెర్షన్ లో తీసుకురానున్నారు. అయితే అంతకంటే ముందే మూడు మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2024 / 01:23 PM IST

    Renault Kwid

    Follow us on

    Renault Kwid: 2024 కొత్త ఏడాది సందర్భంగా కొంత మంది కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆటోమోబైల్ రంగంలోని కార్ల కంపెనీలు నూతన సంవత్సరంలో కొత్తకార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ రెనో సైతం 2024లో మూడు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వాటి వివరాలను ప్రకటించింది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలతో పాటు బెస్ట్ ఫీచర్స్ ఉండే ఆ కార్ల గురించి పరిశీలిస్తే..

    రెనో కంపెనీ నుంచి గతంలో రిలీజ్ అయిన డస్టర్ గురించి తెలిసిందే. ఇప్పుడు దానిని అప్డేట్ వెర్షన్ లో తీసుకురానున్నారు. అయితే అంతకంటే ముందే మూడు మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో రెనాల్ట్ క్విడ్ ఫీచర్స్. రెనో క్విడ్ RXL(0) ఏఎంటీ ట్రాన్స్ మిషన్ రాబోతుంది. దీని ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో డ్యూయెల్ టోన్ కలర్లో అందుబాటులో ఉంది.

    రెనో కంపెనీ నుంచి మరో కారు ట్రైబర్ ఫీచర్స్ రాబోతుంది. ఇందులో 7 ఇంచెస్ టీఫ్ఎటీ ఇన్ స్టుమెంట్ కన్సోల్, స్మార్ట్ ఫోన్ చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిగతా కార్లలో లేని స్టీల్ బ్లాక్ ఎక్స్ టీరియర్ పెయింట్ స్కీమ్ తో తీసుకురానున్నారు. ఇక రియర్ ఎయిర్ కండిషనర్ వెంట్స్, పీఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్ వంటివి ఆకర్షిస్తాయి. దీనిని రూ.6 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.11 లక్షల వరకు విక్రయించనున్నారు.

    రెనో కిగర్ ఆర్ ఎక్స్ ఎల్ పేరుతో మరో మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, సెమీ లెథేరెట్ సిట్ అప్ హోల్ స్టెరీ, ఆర్ ఎస్ టీ టర్బో మాన్యువల్ సీవీటి ఆప్షన్లతో కలిగి ఉంది. దీనిని రూ.6.50 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు విక్రయించనున్నారు. ఇవే కాకుండా త్వరలో 7 సీటర్ కార్లను కూడా రెనో అందుబాటులోకి తీసుకురానుంది.