https://oktelugu.com/

ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !

అర్జున్‌ రెడ్డి.. ఒక చిన్న సినిమా.. కానీ ఈ చిత్రం టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేసింది. బోల్డ్ జోనర్ లోనే మరో రేంజ్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. విజయ్ దేవరకొండ అనే అడ్రెస్ లేని ఒక చిన్న హీరోను సెన్సేషనల్ స్టార్ ను చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధ కాలంలో అర్జున్ రెడ్డి అనేది ఒక బోల్డ్ క్లాసిక్ పీస్. ఈ విషయంలో ఎలాంటి అనుమానం […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 01:43 PM IST
    Follow us on


    అర్జున్‌ రెడ్డి.. ఒక చిన్న సినిమా.. కానీ ఈ చిత్రం టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేసింది. బోల్డ్ జోనర్ లోనే మరో రేంజ్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. విజయ్ దేవరకొండ అనే అడ్రెస్ లేని ఒక చిన్న హీరోను సెన్సేషనల్ స్టార్ ను చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధ కాలంలో అర్జున్ రెడ్డి అనేది ఒక బోల్డ్ క్లాసిక్ పీస్. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లేకపోతే ఈ సినిమాని చూసి బాలీవుడ్ జనాలు కూడా ఎందుకు అంతగా తపన పడతారు. కబీర్ సింగ్ అనే పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ ట్రేండింగ్ నేమ్. అర్జున్ రెడ్డి బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన సినిమాగా కూడా క్రెడిట్ కొట్టేసిందంటే.. ఈ సినిమా స్క్రిప్ట్ వాళ్లకు ఎంతలా నచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

    ఇలాంటి సినిమాని తెర‌కెక్కించాడు కాబట్టే… సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. ఏమైనా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి.. పదిహేను కోట్లు డైరెక్టర్ గా చలామణి అవ్వడం అంటే మాటలా. నిజానికి ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాడం దాసరి నారాయణరావు లాంటి లెజండరీ డైరెక్టర్ కే సాధ్యం కాలేదు. అలాగే రాఘవేంద్రరావు కూడా బాలీవుడ్ సినిమాలు చేసినా.. ఎన్నడూ సందీప్ రెడ్డి రేంజ్ లో పాపులారిటీని సంపాదించలేదు. అయితే ఒక్క అర్జీవీ మాత్రం బాలీవుడ్ లో తెలుగు జెండా ఎగరేశాడు.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

    కానీ ప్రస్తుతం అర్జీవీ తెలుగులోనే డిజాస్టర్ డైరెక్టర్ గా పూర్తిగా పతనం అవుతున్న పరిస్థితి. రాజమౌళికి హిందీలో భారీ డిమాండ్ ఉంది గాని, ఆయన డైరెక్ట్ హిందీ సినిమా చేసే ఆలోచనలో లేడు. ఈ లెక్కన సౌత్ ఇండస్ట్రీ నుండి వెళ్లిన డైరెక్టర్స్ లో బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ డమ్ సాధించి.. అక్కడే భారీ హిందీ సినిమాలు చేస్తోన్న డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగాకి ఆ ఘనత దక్కుతుంది. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. రణ్ బీర్ సింగ్ హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌ కి సంబంధించి స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసుకుని త్వరలోనే ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు.