https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 లో ఆ వివాదాస్పద టీవీ9 న్యూస్ రీడర్.. రచ్చరచ్చేనట!

తాజా సమాచారం ప్రకారం పుష్ప మూడో పార్ట్ కూడా రాబోతుందని సమాచారం. పుష్ప 2 లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్ తో ముగిస్తారని తెలుస్తుంది. ఇక పుష్ప 3 తో ఈ సిరీస్ ముగిస్తారట.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 05:42 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ, ఫహద్ ఫజల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప మూడో పార్ట్ కూడా రాబోతుందని సమాచారం. పుష్ప 2 లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్ తో ముగిస్తారని తెలుస్తుంది. ఇక పుష్ప 3 తో ఈ సిరీస్ ముగిస్తారట. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్ 2025 లో షురూ కానుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమా తర్వాత పుష్ప 3 ఉండనుంది అని సమాచారం.

    కాగా పుష్ప 2 సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ దేవి నాగవల్లి ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఆమెతో దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు టాక్. ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో దేవి నాగవల్లి మెరవనుంది అనేది తెలియాల్సి ఉంది. దేవి నాగవల్లి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. పలు వివాదాలు ఆమె పేరిట ఉన్నాయి. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఓ భారీ సంస్థ నుంచి పుష్ప 2 మూవీకి సంబంధించిన అన్ని హక్కులు కోసం 1000 కోట్ల రూపాయలు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక పుష్ప విషయానికొస్తే .. ఫ్యాన్ ఇండియా సినిమాగా 2021 లో డిసెంబర్ 17న విడుదలైంది. మంచి కలెక్షన్స్ తో పాటు ప్రశంసలు కురిశాయి. సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు.