PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ వయసులను ఆయన అత్యంత చాలాకీగా ఉంటారు. మాంసాహారాన్ని ముట్టరు.. దేవీ నవరాత్రుల్లో అయితే అత్యంత కఠిన ఉపవాసం ఉంటారు. ఆ రోజుల్లో కేవలం నిమ్మరసం మాత్రమే తాగుతారు. అలాంటి నరేంద్ర మోడీ రోజువారి జీవితంలో యోగాకు అమితమైన ప్రాధాన్యమిస్తారు. వ్యాయామం కూడా అదే స్థాయిలో చేస్తారు. అందుకే 365 రోజులు ఆయన పని చేయగలుగుతారు.. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆయన పని చేయడం వెనక అసలు ఉద్దేశం ఇదే. అలాంటి నరేంద్ర మోడీ దేశ ప్రధాని హోదాలో వివిధ దేశాలకు వెళుతూ ఉంటారు.. వీలు చిక్కినప్పుడల్లా మనదేశంలోనూ పలు ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు.. పర్యాటకపరంగా వాటి విశేషాలను కూడా సామాజిక మాధ్యమ వేదికల్లో పంచుకుంటారు.. అయితే ఇటీవల నరేంద్ర మోడీ లక్ష్యద్వీప్ ప్రాంతానికి వెళ్లారు. సముద్రంలోని బీచ్ ప్రాంతాన్ని సందర్శించారు. కుర్చీ వేసుకుని కూర్చుని సముద్ర అందాలను వీక్షించారు. అంతేకాదు సముద్రంలో ఒక సాహసానికి కూడా ఒడిగట్టారు.
లక్షద్వీప్ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు ఆయన సముద్రంలో స్నార్కెలింగ్( సముద్రపు అడుగుభాగానికి వెళ్ళటం) చేశారు. ప్రత్యేక దుస్తులు ధరించి.. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని నిపుణుల పర్యవేక్షణలో సముద్రపు అంతర్భాగానికి వెళ్లారు. అక్కడ వివిధ రకాల జలచరాలను పరిశీలించారు. స్వతహాగా ఈతగాడైన నరేంద్ర మోడీ నిపుణులు సూచించిన సమయం వరకు సముద్రపు అంతర్భాగాన్ని మొత్తం కలియతిరి గారు. అక్కడ అరుదైన వృక్ష ప్లవకాలు, అరుదైన సముద్రపు జంతువులను ఫోటోలు తీశారు. వాటిని ఆయన తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సముద్రపు అంతర్భాగంలో తన ప్రయాణాన్ని పంచుకున్నారు..
సాహస క్రీడలు అంటే ఇష్టపడేవారు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.. మీరు సాహస క్రీడలను ఇష్టపడే వారైతే కచ్చితంగా మీ దృష్టిలో లక్ష్యద్వీప్ ఉండాల్సిందే. ఇక్కడ ఎన్నో రకాలైన సముద్రపు జంతువులు ఉన్నాయి. విస్తారమైన బీచ్ లు ఉన్నాయి. రిసార్టులు కూడా మీకు అందమైన ఆతిథ్యాన్ని ఇస్తాయి. నేను కూడా లక్ష్యద్వీప్ లో సాహస క్రీడలో భాగంగా సముద్రపు అంతర్భాగానికి వెళ్లి వచ్చాను. ఇది నాకు ఉద్వేగ భరితమైన క్షణం. దీనిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. అంటూ నరేంద్ర మోడీ తన సామాజిక మాధ్యమాలలో తన అనుభవాలను పంచుకున్నారు. నరేంద్ర మోడీ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఇటువంటి సాహసాలకు ఒడి కట్టారు. డిస్కవరీ ఛానల్ కోసం అడవిలో, సముద్రంలో ప్రయాణించారు. చిన్నప్పుడు తాను మొసలిని పట్టుకుని అనుభవాన్ని డిస్కవరీ ఛానల్ వ్యాఖ్యాతతో పంచుకున్నారు. అంతేకాకుండా సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఎముకలు గడ్డకట్టే చలిలో విధులు నిర్వహిస్తున్న సైనికుల దగ్గరికి వెళ్లారు. వారితో దీపావళి వేడుకలు కూడా చేసుకున్నారు. సాధారణంగా ఎవరికైనా వయసు పెరుగుతుంటే నిస్సత్తుగా ఆవరిస్తూ ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ విషయంలో ఇందుకు భిన్నంగా ఉంది.. కాగా నరేంద్ర మోడీ తన లక్ష్యద్వీప్ ప్రయాణానికి సంబంధించి పంచుకున్న అనుభవాలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.