Mahesh Babu: మహేష్ బాబు వల్ల కెరియర్ నాశనం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరంటే..?

మహేష్ బాబుతో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ని బాగా డీల్ చేశారు.

Written By: Gopi, Updated On : January 4, 2024 5:45 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో మంచి విజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు అయితే మొదటి నుంచి కూడా మహేష్ బాబు డైరెక్టర్ చెప్పినట్టుగానే చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ మహేష్ బాబు తో సినిమా చేసి ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు దూరమైన డైరెక్టర్ ఎవరు అంటే శ్రీకాంత్ అడ్డాల అనే చెప్పాలి.

ఈయన మహేష్ బాబుతో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ని బాగా డీల్ చేశారు. అయితే మహేష్ బాబు తో శ్రీకాంత్ అడ్డాల ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఇక దానికి తగ్గట్టుగానే యాక్షన్ సినిమాని మహేష్ బాబు చేయాలని ప్లాన్ చేసాడు. కానీ మహేష్ ఆ స్క్రిప్ట్ వద్దు మళ్ళీ ఫ్యామిలీ సినిమాతోనే వెళ్దామని చెప్పడంతో ఆయన బ్రహ్మోత్సవం అనే సినిమా స్టోరీ రాసి మహేష్ బాబు కి చెప్పాడు. అది మహేష్ బాబుకి బాగా నచ్చడంతో ఫ్యామిలీ సినిమా గా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల చేస్తాను అని చెప్పిన యాక్షన్ సినిమా కాకుండా ఫ్యామిలీ సినిమా చేయడం తో ఆ సినిమా ప్లాప్ అయింది ఇక దాంతో శ్రీకాంత్ కెరీయర్ అనేది డైలమా లో పడిందని చాలామంది ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలా మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కెరియర్ ని నాశనం చేశాడు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులను పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో నారప్ప సినిమా చేశాడు.

ఈ సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత చేసిన పెద్ద కాపు సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల మరోసారి భారీ ఫ్లాప్ ని చవి చూశాడు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కి సినిమా ఇచ్చే హీరో లేడనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.