https://oktelugu.com/

Godfather New Song: చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చేస్తే బీభత్సమే ఇక.. అభిమానులు ఈ రోజు ఆగలేరంతే!

Godfather New Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’ నుంచి ఒక పాట రిలీజ్ కు రంగం సిద్ధమైంది. గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కథను మలుపుతిప్పే ఈ పాత్రను సల్మాన్ చేస్తుండడంతో ఈ మూవీని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి-సల్మాన్ ఖాన్ లు కలిసి డ్యాన్స్ చేసిన ఒక పాట ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల15న […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2022 / 11:06 AM IST
    Follow us on

    Godfather New Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’ నుంచి ఒక పాట రిలీజ్ కు రంగం సిద్ధమైంది. గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కథను మలుపుతిప్పే ఈ పాత్రను సల్మాన్ చేస్తుండడంతో ఈ మూవీని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి-సల్మాన్ ఖాన్ లు కలిసి డ్యాన్స్ చేసిన ఒక పాట ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల15న రిలీజ్ కు రెడీ చేయగా.. సాంకేతిక సమస్యలతో వాయిదా పడింది. అక్టోబర్ 5న మూవీ విడుదల అవుతుండగా.. నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.

    chiranjeevi, salman khan

    బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ .. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కలిసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పాట ఉర్రూతలూగించడం ఖాయం. ఇదో విజువల్ ట్రీట్ అంటున్నారు.

    ఈ సినిమాలో ‘మార్ మార్.. తక్కర్ మార్.. ’ అంటూ సాగే పాటలో చిరంజీవి , సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేశారు. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ప్రోమో ఊపేసింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ ఇంకెంతగా అభిమానులను అలరిస్తుందో చూడాలి.

    chiranjeevi, salman khan

    ఈ రోజు చిరంజీవి-సల్మాన్ ల ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పాటలు రిలీజ్ చేస్తూ ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ లోపు బాగా ప్రమోట్ చేయాలని.. హైప్ తీసుకురావాలని చిత్రం యూనిట్ ప్లాన్లు చేస్తోంది. ఈ సాంగ్ ఏ మేరకు అలరిస్తుందన్నది వేచిచూడాలి.

    Recommended videos:


    Tags