Prabhas: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన షూటింగ్స్ కి కూడా వెళ్లడం లేదు. నెలరోజుల పాటు సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాల షూటింగ్స్ ఆయన వాయిదా వేశారు. కృష్ణంరాజు మరణానంతర కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యే వరకు వేరే పని పెట్టుకోకూడని ప్రభాస్ భావిస్తున్నారు. అలాగే విషాద సమయంలో కృష్ణంరాజు భార్య, పిల్లలకు తన తోడు చాలా అవసరమనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. కాగా కృష్ణంరాజు సొంత ఊరు మొగల్తూరులో దశదిన కర్మ భారీగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొగల్తూరులో దాదాపు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారట. అనంతరం అక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారట. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారట. ఇక 12 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రభాస్ సొంత ఊరుకి వెళుతున్నారు. 2010లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు మరణం నేపథ్యంలో పెద్ద కర్మ కోసం ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయన అక్కడకు వెళుతున్నారు.
అలాగే పెదనాన్న కృషంరాజుకు పుట్టిన ఊరంటే మహా ఇష్టం. ఆయన క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు సొంత ఊరు వెళ్ళేవారట. అక్కడున్న నివాసంలో ప్రశాంతంగా గడపడం, మిత్రులను, బంధువులను కలవడం ఇష్టమైన వ్యాపకమట. ఐతే గత రెండేళ్ల నుండి ఆయన కూడా వెళ్లడం లేదట. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నివాసానికే కృష్ణంరాజు పరిమితం అవుతున్నారు. అలాగే వయోభారం, అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు ప్రయాణాలు చేయడం లేదు.
Also Read: Team India: టీమిండియా టీ20 కప్ కొడతుందా? పడిపోతుందా? రేపు తేలబోతోంది!
కొద్దిరోజుల కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. సెప్టెంబర్ 11 తెల్లవారుజామున ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నటుడిగా, రాజకీయవేత్తగా సుదీర్ఘకాలం సేవలు అందించిన కృష్ణంరాజు మరణంతో పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి గురయ్యాయి.ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Recommended videos: