Jr NTR War 2 dubbing: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరో గా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసాడు. ఆగస్టు 14 న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన టీజర్ ని రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా , ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాట సన్నివేశాలు మామూలు రేంజ్ లో లేవు అనేది ఈ టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. అయితే రీసెంట్ గానే ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేసాడు. కేవలం తెలుగు, హిందీ లో మాత్రమే కాదు..కన్నడ,మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా ఆయన డబ్బింగ్ పూర్తి చేసాడు.
Also Read: అల్లు అరవింద్ ను ప్రశ్నించిన ఈడీ
ఎన్టీఆర్ కి ఇది కొత్తేమి కాదు, గతంలో దేవర, #RRR చిత్రాలకు కూడా ఆయన 5 భాషల్లో డబ్బింగ్ చెప్పాడు. #RRR లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా అదే చేసాడు. మరి ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ తో కలిసి చేసిన హృతిక్ రోషన్ కూడా 5 భాషల్లో డబ్బింగ్ చెప్తాడా లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని భాషల్లో కలెక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు, అన్ని బాషల మీద గౌరవం కూడా ఉండాలి కదా?, నీ తోటి హీరో చేసినప్పుడు, నువ్వు చెయ్యడానికి ఏమైంది? అంటూ సోషల్ మీడియా లో హృతిక్ రోషన్ ని ట్యాగ్ చేసి అభిమానులు అడుగుతున్నారు. మరి ఆయన 5 భాషల్లో డబ్బింగ్ చెప్తాడో లేదో చూడాలి. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమాలోని చివరి పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్,హృతిక్ రోషన్ మధ్య మేకర్స్ నాటు నాటు రేంజ్ సాంగ్ ని షూట్ చేశారట.
Also Read: దిల్ రాజుకు ఏమైంది? ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టార్ ప్రొడ్యూసర్!
ఇప్పటి వరకు ‘వార్ 2‘ చిత్రానికి తెలుగు లో పెద్ద క్రేజ్ లేదు. కానీ సాంగ్ కారణంగా మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత సూర్య దేవర నాగవంశీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ డైరెక్ట్ తెలుగు సినిమా అయితే ఇంత పెట్టడం లో ఎలాంటి రిస్క్ లేదు. కానీ ఇది హిందీ డబ్ సినిమా, దీనికి ఆ రేంజ్ బిజినెస్ అంటే చాలా పెద్ద రిస్క్. పైగా ఈ సినిమా విడుదల అయ్యే రోజునే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం విడుదల కాబోతుంది. కూలీ కి ప్రస్తుతం తెలుగు లో ‘వార్ 2’ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.