https://oktelugu.com/

Thaman-Sreeleela: తిరుమలలో అపచారం… హీరోయిన్ శ్రీలీలను అలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్!

Thaman-Sreeleela: దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలో థమన్, శ్రీలీల కలిశారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. శ్రీలీల థమన్ కి తన తల్లిని పరిచయం చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 26, 2024 / 02:46 PM IST

    Thaman touches Sreeleela cheeks at Tirumala Temple netizens trolling

    Follow us on

    Thaman-Sreeleela: తరచుగా వివాదాల్లో ఉంటాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. ఆయన సాంగ్స్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటాయి. యూట్యూబ్ ఛానల్స్ నుండి కూడా ట్యూన్స్ లేపేసి దొరికిపోయాడు. స్టార్ హీరోల చిత్రాలకు కూడా ట్యూన్స్ కాపీ చేస్తుంటాడు. ఈసారి ఆయన చెడు ప్రవర్తనతో వార్తలకు ఎక్కాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీలతో ఆయన పవిత్ర తిరుమలలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. శ్రీలీల తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో థమన్ సైతం శ్రీవారిని సందర్శించారు.

    దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలో థమన్, శ్రీలీల కలిశారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. శ్రీలీల థమన్ కి తన తల్లిని పరిచయం చేసింది. ఆ సమయంలో శ్రీలీల బుగ్గను థమన్ గిల్లాడు. పవిత్ర తిరుమల పరిసర ప్రాంతాల్లో థమన్ చేసిన పని చర్చకు దారి తీసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పవిత్ర తిరుమలలో ఒక మహిళ పట్ల థమన్ ప్రవర్తించిన తీరు సరికాదని పలువురు ఖండిస్తున్నారు.

    Also Read: Vinoth Kishan: సినిమా హిట్ అయ్యాక వడ్డీతో సహా ఇచ్చేస్తా… కొత్త హీరో వింత రిక్వెస్ట్!

    ఇక శ్రీలీల కెరీర్ పరిశీలిస్తే వరుస చిత్రాలు చేసిన ఆమెకు కొంచెం బ్రేక్ వచ్చింది. ఒక దశలో అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. ప్రస్తుతం నితిన్ తో ఒక చిత్రం చేస్తున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజకీయంగా పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రం చేస్తున్నాడు.

    Also Read: Senior Actor: సీనియర్ నటుడు కొనుగోలు చేసిన ఈ ఖరీదైన కారు ధర ఎంతో తెలుసా?

    త్వరలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో అడుగుపెడితే శ్రీలీల బిజీ అవుతుంది. మరోవైపు శ్రీలీల చదువు మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. శ్రీలీల ఎంబీబీఎస్ స్టూడెంట్ అన్న విషయం తెలిసిందే. ఆమె పరీక్షలకు సిద్ధం అవుతున్నారట. శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. దాంతో కూతురిని కూడా మెడిసిన్ చదివిస్తుంది. హీరోయిన్ గా ఆమె సక్సెస్ కావడంతో వరుస ఆఫర్స్ వచ్చాయి.