https://oktelugu.com/

OG Movie: విడుదలకు ముందే ఓజీ రివ్యూ ఇచ్చేసిన థమన్, పవన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఎలా ఉండనుంది?

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ఆయన పూర్తి చేయాల్సి ఉంది. కాగా విడుదలకు ముందే ఓజీ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ క్రమంలో కీలక కామెంట్స్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 5, 2024 / 11:43 AM IST

    OG Movie

    Follow us on

    OG Movie: గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. కాగా పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు చాలా కాలంగా ఆగిపోయింది. దాంతో ఇటీవల హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో జాయిన్ అయినట్లు సమాచారం.

    అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సైతం పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సుజీత్ ఓజీ చిత్రాన్ని గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తుంది. కాగా ఓజీ అప్డేట్స్ కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని అడుగుతున్నారట. థమన్ ఓజీ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

    తాజాగా ఓజీ పై తన షార్ట్ రివ్యూ ఇచ్చాడు థమన్. అందరూ నన్ను ఓజీ అప్డేట్స్ అడుగుతున్నారు. ఓజీని దర్శకుడు సుజీత్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఓజీ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం. త్వరలోనే ఓజీ అప్డేట్స్ వరుసగా విడుదల చేస్తారు… అని థమన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. థమన్ కామెంట్స్ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా గేమ్ ఛేంజర్ అప్డేట్ కూడా ఇచ్చాడు.

    గేమ్ ఛేంజర్ కోసం కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్ బాగా వచ్చిందని ఆయన అన్నారు. అటు పరిపాలన నిర్లక్ష్యం చేయకుండా… ఇటు నిర్మాతల కోసం సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా.. షూటింగ్ కి హాజరవుతున్నారు. హరి హర వీరమల్లుతో పాటు త్వరలో ఓజీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని సమాచారం.

    ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ కాగా.. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది.