Vijay Son Jason Sanjay Surname Change: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కి రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్న సమస్యలు చూస్తుంటే, అసలు ఈయన ఎన్నికలలో పోటీ చేస్తాడా ?, చేసిన జనాలు ఓట్లు వేస్తారా అనేలా తయారైంది పరిస్థితి. కరూర్ ఘటన నుండి ఆయనకు ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఆ ఘటన లో పాతిక మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయం లో వాళ్ళ పట్ల విజయ్ స్పందించిన తీరు అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. ఇక రీసెంట్ గా విజయ్ సతీమణి సంగీత , తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కడం కూడా విజయ్ కి రాజకీయ పరంగా తీవ్రమైన దెబ్బ తీసే అంశం . ఇదంతా ఆయన చేతుల్లారా చేసుకుంటున్నదే అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలను రోడ్డు మీదకు వచ్చేలా చేసాడు.
Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే
పైగా ఎదో గొప్ప ఘనకార్యం చేసినట్టు, త్రిష తో కలిసి రీసెంట్ గా ఆయన ఒక పెళ్లి ఈవెంట్ లో పాల్గొనడం సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అభిమానులు సైతం విజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంగీత కి న్యాయం జరగాలి అంటూ ముందుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ తో ఇప్పుడు ఆయన పిల్లలు కూడా మాట్లాడడం లేదని స్పష్టం గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు త్రిష తప్ప, ఎవ్వరూ లేరట. తన తల్లిదండ్రులకు కూడా చాలా కాలం నుండి ఆయన దూరంగా ఉంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ , విజయ్ కి కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సంజయ్ దర్శకత్వం లో సిగ్మా అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మన తెలుగు హీరో సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా లో తన టైటిల్ కార్డు వచ్చేటప్పుడు, తన పేరు నుండి విజయ్ ఇంటి పేరు ని తొలగించి, తన తల్లి సంగీత ఇంటి పేరు వచ్చేలా చేశాడట.
ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. సరిగ్గా ఎన్నికల సమయం లో విజయ్ తప్పు చేసినట్టు జనాలకు అర్థం అవ్వడం , తన భార్య పిల్లలు కూడా దూరం అవ్వడం , ఇవన్నీ ఆయన ఓటింగ్ పై ప్రభావం చూపించే అంశాలు. నిన్న గాక మొన్న ఆయన TVK పార్టీ లోకి వచ్చిన నాయకులూ కూడా విజయ్ తీరుని తప్పుబట్టి పార్టీ కి రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం విజయ్ పరిస్థితి ఎలా ఉంది అనేది. రాబోయే రోజుల్లో విజయ్ ని కేంద్రం గా చేసుకొని ఇంకెన్ని రాజకీయాలు జరుగుతాయో చూడాలి.