Ramayana Movie: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ మూవీ గురించే చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి బయ్యర్స్ కాస్త భయపడిన విషయం వాస్తవమే కానీ, పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత వసూళ్లు బాగా పుంజుకున్నాయి. రెండవ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ తో ఎలాంటి సూపర్ హిట్ ని మిస్ అయ్యామో అని తల్చుకుంటూ బాధపడుతున్నారు.
ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి బూతులు తిడుతున్నారు. రామాయణం ని ఎలా తియ్యాలో అనేది మొన్న విడుదలైన ‘రామాయణ’ చిత్రం ఉదాహరణగా చూపిస్తే, రామాయణం ని ఎలా తీయకూడదో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని చూసి తెలుసుకోవచ్చని అంటున్నారు. అయితే ‘రామాయణ’ చిత్రం ‘ఆదిపురుష్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకోలేకపోయింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 138 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని , కానీ ‘రామాయణ’ చిత్రానికి కేవలం 127 కోట్లు మాత్రమే వచ్చిందని , దీన్ని బట్టీ ప్రభాస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని, సరిగ్గా ఆ చిత్రాన్ని డీల్ చేసి ఉండుంటే వసూళ్ల సునామీ ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రెండు రోజులకు కలిపి ‘రామాయణ’ చిత్రం వరల్డ్ వైడ్ గా 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.