Telusu Kada Teaser Review: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ‘డీజే టిల్లు’ నిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు సిద్దు జొన్నలగడ్డ… టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన జాక్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో ఆయన ప్లాపుల్లో పడ్డాడు. మరి ఇప్పుడు నీరజ కోన దర్శకత్వంలో చేస్తున్న ‘ తెలుసు కదా ‘ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక అందులో భాగంగానే ఈరోజు ఆయన నటించిన తెలుసు కదా సినిమాలోని టీజర్ అయిగే రిలీజ్ అయింది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం కోసం మౌళి భారీ రెమ్యూనరేషన్..అప్పుడే తేజ సజ్జ ని దాటేశాడుగా!
ఇక ఈ టీజర్ ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిద్దు అటు రాశిఖన్నాని, ఇటు శ్రీనిధి శెట్టి ఇద్దరినీ లవ్ చేస్తూ కనిపించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఏది చేసినా కూడా ఇద్దరితో సమానంగా చేస్తున్నాడు. ఇద్దరితో రొమాంటిక్ సీన్స్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే మనం పెళ్లి చేసుకుందాం అని ఇద్దరితో చెప్పిన సిద్దు ఫైనల్ గా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇలాంటి సందర్భంలో సిద్దు జొన్నలగడ్డ లాంటి నటుడు ఈ సినిమాలో చాలా బాగా నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా హైలెట్ గా నిలవబోతుందట. ఎందుకని తను ఇద్దరితో ప్రేమ వ్యవహరం నడుపుతాడు. కథ ఇంతేనా లేదంటే ఇంటర్ లింకుగా వేరే కథ కూడా నడువబోతొందా?
అసలు ఈ తెలుసు కదా సినిమాతో ఏం చెప్పబోతున్నారు అనేది చాలా సస్పెన్సివ్ గా ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో నీరజ కోన గొప్ప పేరు సంపాదించుకుంటుందా… ఇక మరోసారి సిద్దు జొన్నలగడ్డ కూడా సక్సెస్ బాట పడతాడా. ? ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…