Heroine Hansika: ప్రముఖ హీరోయిన్ హన్సిక(Hansika Motwani) కు ముంబై హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం హన్సిక ముంబై హై కోర్టు లో తన మాజీ వదిన వేసిన గృహ హింస కేసు ని కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ ని దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిపిన ధర్మాసనం, హన్సిక క్వాష్ పిటీషన్ ని కొట్టిపారేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హన్సిక సోదరుడి భార్య హన్సిక తో సహా, ఆమె తల్లి పై మరియు ఇతర కుటుంబ సభ్యులపై గతం లో గృహ హింస చట్ట క్రింద కేసు నమోదు చేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ 2020 వ సంవత్సరం లో ప్రముఖ సీరియల్ నటి ముస్కాన్ జేమ్స్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఒక ఏడాది పాటు వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత ఎందుకో వీళ్ళ మధ్య అనేక విబేధాలు ఏర్పడ్డాయి.
Also Read: ‘తెలుసు కదా ‘ టీజర్ రివ్యూ : ఇద్దరి మధ్యన నలిగిపోయిన సిద్దూ…
ఆ కారణం చేత 2022 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. అదే సమయం లో ముస్కాన్ జేమ్స్ తన భర్త ప్రశాంత్ తో పాటు హన్సిక, ఆమె తల్లి జ్యోతి లు, ఇంట్లో ఉన్నన్ని రోజులు నన్ను చిత్ర హింసలకు గురి చేసారని, ఆ టార్చర్ ని భరించలేకనే విడిపోయానని కోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు పై అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి హన్సిక, ఆమె తల్లి జ్యోతి ముంబై సెషన్స్ కోర్టు నుండి ముందస్తు బెయిల్ ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత మా పై తప్పుడు కేసు పట్టిందని, దీనిని విచారించి తక్షణమే కేసు ని కొట్టివేయాలంటే హన్సిక, జ్యోతి లు హై కోర్టు ని ఆశ్రయించారు. ఈ కేసు పై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూనే ఉంది. నేడు తుది తీర్పుని ఇచ్చారు.
హన్సిక, జ్యోతిలకు అనుకూలంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, ముస్కాన్ జేమ్స్ పిటీషన్ లో చాలా బలమైన ఆధారాలు ఉన్నాయని, కాబట్టి ఈ కేసు ని కొట్టివేయడం కుదరదు అంటూ హై కోర్టు తీర్పుని ఇచ్చింది. మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఈమధ్య కాలం లో హన్సిక ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటుంది. గత కొద్దిరోజుల నుండి ఈమె తన భర్త కి దూరంగా ఉందని, వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. హన్సిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను తొలగించింది. మరోపక్క ఆమె కెరీర్ కూడా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. ప్రస్తుతం ఈమె నుండి రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి వంటి తమిళ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కాకుండా హిందీ లో లవ్ ఎఫైర్ అనే చిత్రం కూడా చేసింది. ఇది కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఇవి తప్ప ఆమె చేతిలో మరో కొత్త సినిమా లేకపోవడం గమనార్హం.