Telugu Young Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లే కావడం విశేషం…ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో వాళ్ళు చేసిన సినిమాలతో గుర్తింపును సంపాదించుకొని 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి టైర్ వన్ హీరోలుగా మారుతున్నారు. ఇందులో కొందరు 30 లోనే టైర్ వన్ హీరోలుగా మారినారు. కానీ ఇప్పుడున్న సమయంలో 40 సంవత్సరాలు రాకముందే టైర్ వన్ హీరోలుగా మారే అవకాశం ఉన్న హీరోలు ఎవరున్నారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు 40 ప్లస్ లోనే ఉన్నారు. కాబట్టి 30 దాటి ఇంకా 40 సంవత్సరాలు రాని హీరోలు టాప్ రేంజ్ లో ఎవరున్నారు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ జాబితాలో మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం 36 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు.
40 సంవత్సరాలు వచ్చేసరికి టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే నాని ఇప్పుడు టైర్ వన్ హీరో కోసం ట్రై చేస్తున్నప్పటికి నానికి ప్రస్తుతం 42 సంవత్సరాల వయసు ఉంది. మరి ఈ ఏజ్ లో ఆయన టైర్ వన్ హీరోగా మారినా కూడా ఇంతకుముందున్న టైర్ వన్ హీరోల ప్లేసులో చేరిపోతాడు…
ఇక టైర్ వన్ హీరోల జాబితాలో చేరే వాళ్ళలో తేజ సజ్జా ఉన్నాడు. ప్రస్తుతం తేజ 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు… ఇక వీళ్లిద్దరు ప్రస్తుతం టైర్ వన్ హీరో చేరుకోవడానికి అవకాశమైతే ఉంది. రాబోయే రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే టైర్ వన్ హీరోలుగా మారిపోతారు. మరి 40 సంవత్సరాలు వచ్చే లోపే టైర్ వన్ హీరోలుగా మారతారా? లేదంటే నలభై తర్వాత మారతారా అనేది తెలియాల్సి ఉంది…
