spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Fire Accident: అమరావతి అంటుకుందా? అంటించారా? భారీ కుట్ర జరిగిందా?

Amaravati Capital Fire Accident: అమరావతి అంటుకుందా? అంటించారా? భారీ కుట్ర జరిగిందా?

Amaravati Capital Fire Accident: అమరావతి రాజధాని లో( Amravati capital ) మళ్లీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలోని హెచ్వోడి భవనాల నిర్మాణ ప్రాంగణంలో కాంట్రాక్టు సంస్థకు సంబంధించి పైపులకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసి పడడంతో ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈనెల 11న కూడా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది మానవ తప్పిదమా? కుట్ర కోణమా? అన్న రీతిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పై వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో.. వరుస ఘటనలపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

* హెచ్ ఓ డీల భవనాల సమీపంలో..
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో రాయపూడి( rayapudi ) సమీపంలో నిర్మాణం అవుతున్న హెచ్ఓడీల భవనాల దగ్గర.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన పైపులకు నిప్పు అంటుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులతో పాటు కంపెనీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు వాహనాలతో వచ్చి మంటలను అదుపు చేశాయి. దట్టమైన పొగ ఆవహించడంతో మంటలు నియంత్రించేందుకు ఇబ్బందికరంగా మారింది. అతి కష్టం మీద మంటలను ఆర్పాల్సి వచ్చింది.

* అప్పుడు ఎల్ అండ్ టీ పైపులు..
రెండు వారాల వ్యవధిలోనే రెండు అగ్ని ప్రమాద ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 11న వెలగపూడి ( velaga podi )సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన హెచ్డిపిఈ పైపులకు ఇలాగే మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనేది తెలియాలి. గత కొంతకాలంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఇటువంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version