Rajamouli Mahabharat: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలు పెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తన పరిధిని విస్తరించుకున్నాడు. వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చిన ఆయన ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా మీద చాలా మంది చాలా రకాల డౌట్లను వెల్లడిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కూడా లేని మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు.ఇక మరికొంతండి మాత్రం దాని వెనకాల రాజమౌళి ఉన్నాడు కాబట్టి హీరోలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు సినిమా ఆటో మేటిగ్గా భారీ బజ్ క్రియేట్ చేసుకొని పెను ప్రభంజనాన్ని సృష్టించే కలెక్షన్స్ ను రాబడుతుందని కొంతమంది చెబుతున్నారు…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహాభారతం’ మూవీ ని వారణాసి సినిమా తర్వాత స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ గతంలో రాజమౌళి కొన్ని లీకులైతే ఇచ్చాడు.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
మరి వాటిని బట్టి చూస్తే రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి వాళ్ళ నాన్న ప్రముఖ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ విషయం మీద రీసెంట్ గా స్పందించాడు. రాజమౌళి చేయబోయే మహాభారతం సినిమాలో తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరిని భాగం చేయాలని చూస్తున్నాడట.
ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య, నాగార్జున కి సపరేట్ రోల్స్ ఉండబోతున్నాయట… బాలయ్యను నెగెటివ్ రోల్ లో చూపించాలని అనుకుంటున్నారట. అందుకే బాలయ్య కి కౌరవుల్లో ఎవరో ఒకరి రోల్ ను కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగార్జున ను ద్రోణుడి పాత్ర కోసం తీసుకోబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. పాండవులకు, కౌరవులకు యుద్ధ విద్యను నేర్పే ద్రోణుడి పాత్ర ఎంత వైల్డ్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కనక నిజమైతే మాత్రం అటు బాలయ్య, ఇటు నాగార్జున ఇద్దరు కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించినవారు అవుతారు…
