Telugu TV Shows TRP : గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి తప్ప టెలివిజన్ రంగం మాత్రం ఎప్పుడు చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూనే ఉంది. ప్రేక్షకులందరూ సినిమాలు చూసిన, చూడకపోయిన రోజువారీ క్రమంలో వాళ్ళ బాధ నుంచి రిలీఫ్ అవ్వడానికి సీరియల్స్ ను మాత్రం ఆదరిస్తూ వసచ్చారు. ఇక అందులో భాగంగానే ఆ సీరియల్స్ లోని క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకొని మరి ఆయా సీరియల్ కి భారీ రెస్పాన్స్ ని అందించిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం టెలివిజన్ రంగం లో వస్తున్న సీరియల్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి చాలా ఎంటర్టైన్మెంట్ అందించే ప్లాట్ ఫామ్స్ దొరకడంతో సీరియల్స్ లో వచ్చే నాసిరకం కంటెంట్ ను వాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. నిజానికైతే ఒక పది సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన జబర్దస్త్, ఢీ లాంటి ప్రోగ్రామ్స్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ అయితే దక్కేది. కానీ ఇప్పుడు వాటికి కూడా రోజురోజుకీ టిఆర్పి రేటింగ్ అనేది భారీగా పడిపోతుంది. ఇక ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 8’ షో టాప్ రేటింగ్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంటే మిగతా ఛానల్స్ మాత్రం దాని తాకిడిని తట్టుకోలేక డీలా పడిపోతున్నాయి. ముఖ్యంగా జెమినీ టీవీ అయితే సీరియల్స్ ఎంటర్ టైన్ మెంట్ షోలలో వెనకబడి పోయిందనే చెప్పాలి. ఇక ‘ఈటీవీ ‘ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ‘స్టార్ మా’ తో పోటీపడి నిలబడగలిగే ఛానల్స్ లో జీ తెలుగు మాత్రమే అంతో ఇంతో ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ మరికొన్ని షో లతో నెట్టుకు వస్తుంది. కానీ ఇంతకు ముందుతో పోలిస్తే సీరియల్స్ తో ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేక పోతుంది.
ఇక ఇప్పటికే స్టార్ మా లో వచ్చే బ్రహ్మ ముడి, కార్తీక దీపం, ఇంటింటి రామాయణం లాంటి సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. మిగతా ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ ని డామినేట్ చేస్తూ టాప్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్నాయి. అలాగే జీ తెలుగులో వస్తున్న చాలా సీరియల్స్ ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా ని చాటలేకపోతున్నాయి. ఒకప్పుడు త్రినయని, జగద్దాత్రి లాంటి సీరియల్స్ కొంతవరకు పర్లేదు. అనిపించుకున్నప్పటికీ రొటీన్ కాన్సెప్ట్ లతో మెలో డ్రామాతో అర్థంపర్థం లేని మేకింగ్ షాట్స్ తో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి.
సగటు ప్రేక్షకుడు సినిమాలని చూస్తూ ఎంటైర్ టైన్ అవుతున్న క్రమంలో సీరియల్స్ ఎప్పుడో పాతకాలపు స్టోరీస్ తో వచ్చి ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే ఇవ్వలేకపోతున్నాయి. నిజానికి ఒకప్పుడు జెమినీ టీవీలో వచ్చిన చక్రవాకం, మొగలి రేకులు లాంటి సీరియల్స్ ను ప్రేక్షకులు చాలా సంవత్సరాల పాటు ఆదరించారు. దానికి కారణం ఆ సీరియల్ డైరెక్టర్ అయిన ‘ మంజుల నాయుడు’…
ఆమె ఎంచుకున్న ప్లాట్ పాయింట్ గాని, ఆమె సీరియల్ ని ముందుకు తీసుకెళ్లిన విధానంగానే అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియల్ మేకింగ్ లోనే ఆమె సినిమా స్టాండర్డ్ మేకింగ్ చూపించడం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించేది. కానీ ఇప్పుడున్న సీరియల్స్ పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. అత్త కోడళ్ళ మధ్య గొడవ, ఒకే వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. అలాగే దర్శకుడు కూడా మేకింగ్ లో కొత్త షాట్స్ వాడకుండా రెండు మూడు క్లోజ్ షాట్లను వేస్తూ అసలు ఏ మాత్రం ప్రేక్షకుడి ధోరణిలో ఆలోచించకుండా తనకు నచ్చింది తీసుకుంటూ వెళుతున్నాడు.
ఇక అందులో స్టార్ మా టీవీ సీరియల్స్ కొంతవరకు ఎంగేజ్ చేసినప్పటికీ జీ తెలుగు, ఈటీవీ, జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇదే రీతిలో మరికొద్ది రోజులు ముందుకు సాగితే కనక ఈ ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ కానీ, షోస్ కానీ అన్ని క్లోజ్ అవ్వక తప్పదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటికైనా ఆయా సీరియల్స్ దర్శకులు కొంతవరకు వాళ్ల స్ట్రాటజీ ని మార్చుకొని మంచి సీరియల్స్ తీసి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగితే మంచిది. ఇక ప్రస్తుతం ఉన్న టీఆర్పీ రేటింగ్స్ ను ఆవరేజ్ గా మనం ఒకసారి చూసుకున్నటైతే
మా టీవీ 2401.35
జీ తెలుగు 1552.18
ఈటీవి. 816. 73
స్టార్ మా మూవీస్ 611.59
జెమిని మూవీస్. 541.18
ప్రస్తుతం జీ తెలుగు కూడా భారీగా పడిపోయింది. స్టార్ మా దరిదాపుల్లో కూడా ఏ ఛానల్ లేకపోవడం నిజంగా ఆయా ఛానల్స్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయో చెప్పకనే చెప్తుంది…
ఇక ఓవరాల్ గా మా టీవీ ఈ రేంజ్ లో తన ప్రభంజనాన్ని చూపించడానికి కారణం ఏంటంటే మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే సీరియల్స్ ను చేస్తుంది. అలాగే కోట్లు పెట్టి కొత్త షోస్ ను డిజైన్ చేస్తున్నారు. కొత్త సినిమాలను కొంటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ రోజు టెలివిజన్ రంగం స్టార్ మా టాప్ లెవల్లో దూసుకుపోతుంది…