World ozone day 2024 : తెలిసో తెలియక మనం చేసే చిన్న తప్పుల వల్ల వాతావరణం దెబ్బ తింటుంది. వాతావరణం కలుషితం కావడం వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బ తింటుంది. Yఎండలు ఎక్కువ అయి వేడి బాగా పెరిగిన, వర్షాలు కురవకపోయినా, అడవులు నరికి వేస్తున్న, వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. భూమిపై ఉండే ప్రజలను, జంతువులు అన్నిటిని కూడా ఓజోన్ పోర రక్షిస్తుంది. ఒక పొరలాగా ఉండే ఓజోన్ సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిపై పడకుండా అడ్డుకుంటుంది. ఈ ఓజోన్ పొర లేకపోతే అతి నీలలోహిత కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడతాయి. దీంతో సమస్త ప్రాణకోటి చనిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఓజోన్ పొరను రక్షించుకోవడానికి ప్రతి ఏడాది ఓజోన్ డేను జరుపుకుంటారు. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని వరల్డ్ ఓజోన్ డేను జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఓజోన్ పొర క్రమంగా దెబ్బ తింటుంది. మానవులు చేసే చిన్న తప్పులు వీటికి కారణం అని పరిశోధకులు అంటున్నారు. ఈ ఓజోన్ పొరకు కన్నం పడిందని 1980లో మొదటిసారి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాగా ఈ పొర పూర్తిగా విచ్ఛిన్నం అయితే సమస్త ప్రజలు, చెట్లు, జంతువులు అన్నిటి మీద ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే వీటి వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు పిల్లలు పుట్టే ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అలాగే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఓజోన్ పొరను రక్షించడం ప్రపంచం బాధ్యతగా 1994లో ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16ని ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఓజోన్ డేను జరుపుకుంటారు. ఓజోన్ పొరను కాపాడాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వీటి నిషేధం జరగడం లేదు. అలాగే భూమి వేడి తగ్గించడానికి ఎక్కువగా మొక్కలు నాటాలి. చెట్లు పెంచాలి. అడవులు నరికి వేతను తగ్గించాలి. ప్రస్తుతం చాలా మంది వ్యాపారం, ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువగా అడవులను నరికేస్తున్నారు..పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. చెట్లు నరక కుండా చూసుకోవాలి. ప్రతి దగ్గర మొక్కలు, చెట్లు ఉండేలా చూసుకోవాలి.
మొత్తం 33 శాతం మొక్కలు ఉండేలా చూడాలి. సోలార్ వాడకాన్ని పెంచాలి. అప్పుడే భూతాపాన్ని తగ్గించవచ్చు. అయితే ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్బంగా ఈ ఏడాది థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్: అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. అనేక రసాయనాలను నిషేధించాలని ఈ థీమ్ ను పెట్టారు. ప్రతి ఒక్కరు ఓజోన్ పొరను కాపాడటానికి ప్రయత్నించాలి.